మహేశ్వరం టౌన్, ప్రజాతంత్ర, ఆగస్టు 09; రేషన్ డీలర్లకు ప్రభుత్వం తీపి కబురు అందించింది. వారికిచ్చే కమీషన్ నన్ను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీంతో అయిదారేళ్లుగా ఎదురుచూస్తున్న డీలర్ల నిరీక్షణకు ఫలితం దక్కినట్లయింది. రేషన్ డీలర్లకు ప్రస్తుతం క్వింటాకు రూ.70
చొప్పున కమీషన్ ఇస్తుండగా దీన్ని రెట్టింపు చేసి రూ.140కి పెంచడం పట్ల మహేశ్వరం మండల రేషన్ డీలర్లు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రేషన్ డీలర్లు రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కలిసి పుష్పగుచ్చం అందజేసి కృతజ్ఞతలు తెలిపారు.రంగారెడ్డి జిల్లా రేషన్ డీలర్లు సంఘం అద్యక్షుడు పి లక్ష్మీ నారాయణ, డీలర్లు ఎం ఎ సత్తార్,జి చంద్రశేఖర్ రెడ్డి తో పాటు పలువురు డీలర్లు పాల్గొన్నారు.



