రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమానికి బయలుదేరిన నేదునూరు కాంగ్రెస్ శ్రేణులు
కందుకూరు,ప్రజాతంత్ర,డిసెంబర్ 7 : లాల్ బహుదూర్ స్టేడియంలో బుధవారం తెలంగాణ రెండవ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎనుముల రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకార మహోత్సవానికి మహేశ్వరం నియోజకవర్గం కందుకూరు మండలం,నేదునూరు గ్రామం నుండి గంగుల ప్రభాకర్ రెడ్డి,రంగారెడ్డి జిల్లా మైనార్టీ ప్రధాన కార్యదర్శి ఎండి.అఫ్జల్ బేగ్ ల ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు,అభిమానులు భారీగా తరలి వెళ్లారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ,తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక రాష్ట్ర రెండో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్న సందర్భంగా ఎల్బీ స్టేడియానికి కార్యకర్తలు,నాయకులు కలిసికట్టుగా వెళ్లడం జరిగిందని వారు తెలిపారు.ప్రమాణ స్వీకారోత్సవ భాగంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీ హామీలను నెరవేర్చేందుకు రేవంత్ రెడ్డి ముఖ్యమైన ఫైళ్లపై సంతకం చేయను చేయనున్నారని వారు ఆశాభావం వ్యక్తం చేశారు.రాష్ట్రంలో ఇకనుండి దురఆహంకార పాలనకు చరమగీతం పాడిన ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. రాష్ట్రంలో ప్రజలు ఇప్పటినుండి కాంగ్రెస్ పాలనలో సుభిక్షంగా ఉంటారని,ఇచ్చిన అన్ని గ్యారెంటీ హామీ పథకాలు ప్రజలకు చేరు అవుతాయని వారు ఆశాభావం వ్యక్తం చేశారు.గత ప్రభుత్వం కంటే తమ ప్రభుత్వంలో ప్రజలకు అన్ని విధాలుగా ముఖ్యమంత్రిని,మంత్రులను సైతం కలిసే విధంగా పాలన నడుస్తుందని వారు తెలియజేశారు.రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారోత్సవానికి సోనియా గాంధీ,రాహుల్ గాంధీ,ప్రియాంక గాంధీ,ఖర్గే తదితర హేమాహేమీ నాయకులు అశేష జనాల మధ్యన ప్రమాణ స్వీకారం చేయడం తమకు ఎంతో సంతోషకరంగా ఉందని అన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుతీరిన వెంటనే ప్రజలకు స్వేచ్ఛాయుత వాతావరణం లభిస్తుందని వారు తెలిపారు.కందుకూరు మండల పరిధిలో ఆయా గ్రామాల నుండి అధిక సంఖ్యలో తరలి వెళ్ళారు.ఈ కార్యక్రమంలో గ్రామ వార్డు సభ్యులు ఎగిరిశెట్టి నర్సింహా,మన్నే కర్ణాకర్ రెడ్డి,నాయకులు హరికృష్ణ రెడ్డి,మహిపాల్ రెడ్డి,బోయ కుమార్,దర్శన్,ఆరోగ్య రెడ్డి, రామ్ రెడ్డి,శ్రీకాంత్,జంగయ్య,సల్మా





