- దసరా సందర్భంగా రెండు రోజుల విరామం
- దాదాపు 3500 కిలోమీటర్ల లక్ష్యం…600 మేర పూర్తి
బెంగళూరు, అక్టోబర్ 04 : కార్నాటకలో కొనసాగుతున్న కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు కాంగ్రెస్ అగ్రనేత, ఎంపి రాహుల్ గాంధీ ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన భారత్ జోడో యాత్రకు దసరా పండుగ సందర్భంగా మంగళ, బుధవాలు రెండు రోజులు విరామం ప్రకటించారు. యాత్ర తిరిగి గురువారం పున: ప్రారంభం కానుంది. కాగా రేపటి యాత్రలో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, సీనియర్ నేత, పార్టీ అధ్యక్ష పదవికి పోటీలో ఉన్న మల్లిఖార్జున ఖర్గే పాల్గొననున్నారు. సోనియా గాంధీ సోమవారం నాడే మైసూరుకు చేరుకున్నారు.
ఆమె రెండు రోజుల పాటు కొడగు జిల్లా మడికెరి సమీపంలోని రిసార్ట్లో బస చేయనున్నారు. కాగా సెప్టెంబర్ 7న ప్రారంభమైన యాత్రకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని అందించే ఉద్దేశ్యంతో కాంగ్రెస్ పార్టీ సోమవారం ‘భారత్ జోడో యాప్’ను లాంచ్ చేసింది. 12 రాష్ట్రాలను, 2 కేంద్రపాలిత ప్రాంతాలను కవర్ చేస్తూ కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు జనవరి 30 వనరు 3500 కిలోమీటర్ల మేర కొనసాగనున్న యాత్ర ఇప్పటి వరకు తమిళనాడు, కేరళ రాష్ట్రాలలో పూర్తయి ప్రస్తుతం కర్నాటకలో కొనసాగుతూ దాదాపుగా 600 కిలోమీటర్లు పూర్తి చేసుకుంది.


