ఘనంగా నిర్వహణకు ఏర్పాట్లు..పోలీసుల ఫుల్ డ్రెస్ రిహార్సల్స్
హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 24 : రేపు శుక్రవారం హైదరాబాద్ పబ్లిక్ గార్డెన్స్‌లో 75వ గణతంత్ర వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఉదయం 7.30 గంటలకు జాతీయ జెండాను ఆవిష్కరిస్తారు. అనంతరం ఆమె సభలో ప్రసంగిస్తారు. గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి మండలి, ప్రజాప్రతినిధులు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు హాజరుకానున్నారు. ఇక శుక్రవారం సాయంత్రం రాజ్‌భవన్‌లో ఏటీ హోమ్‌కు గవర్నర్ ఆతిథ్యం ఇవ్వనున్నారు.
ఇక రిపబ్లిక్ డే పరేడ్ కోసం వివిధ విభాగాల ఫుల్ డ్రెస్ రిహార్సల్స్ బుధవారం పబ్లిక్ గార్డెన్‌లో జరిగాయి. రిహార్సల్స్‌లో డీజీపీ రవిగుప్తా, పొలిటికల్ సెక్రటరీ రఘునందన్‌రావు, అగ్నిమాపక శాఖ డీజీ నాగిరెడ్డి, ఎయిర్‌ఫోర్స్, పోలీస్, జనరల్ అడ్మినిస్ట్రేషన్ మరియు ఇతర లైన్ డిపార్ట్‌మెంట్ల సీనియర్ అధికారులు పాల్గొన్నారు.





