రేపు తాండూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సవం

తాండూరు, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 25: ఇటీవల తాండూరు వ్యవసాయ మార్కెట్ కమిటీకి నియమించిన నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం రేపు పట్టణంలోని విలియంమున్  తాండూరు మార్కెట్ కమిటి నూతన చైర్ పర్సన్ గా వీణా శ్రీనివాస్ చారీ, వైస్ చైర్మన్ గా చంద్రవంచ పటేల్ ఉమాశంకర్, డైరెక్టర్లుగా హరిహరగౌడ్, షేక్ ఖాశిం అలీ, మ్యాతరి ప్రకాశం, కుర్వ భీమప్ప, యు. గోపాల్ రెడ్డి, ఎండీ ముస్తఫా. గోవింద్ నాయక్, అప్పుల వెంకటప్పు, మంత్రి వెంకటయ్య, జట్టిగాళ్ల శ్రీనివాస్, భాను ప్రసాద్, ప్రశాంత్ గౌడ్ లు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఆర్థిక మంత్రి తన్నీరు హరీష్ రావు తో పాటు మంత్రి సబితా రెడ్డి మంత్రి మహేందర్ రెడ్డి పార్లమెంట్ సభ్యులు రంజిత్ రెడ్డి స్థానిక ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి తదితరులు హాజరుకానున్నట్లు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *