కందుకూరు,ప్రజాతంత్ర,జూలై 22 : ఈ నెల 24 న మండల ప్రజా పరిషత్ సమావేశ మందిరం నందు సర్వసభ్య సమావేశము నిర్వహించడం జరుగుతుందని కందుకూరు మండల ప్రజా పరిషత్ అభివృద్ది అధికారి వెంకట్ రాములు ఒక ప్రకటనలో తెలిపారు.ఈ సమావేశం ఉదయం 11 గంటలకు ప్రారంభమవుతుందని కావున ఇట్టి సమావేశానికి ఎంపిపి మంద జ్యోతి పాండు అధ్యక్షత వహిస్తారని, ఈకార్యక్రమానికి జడ్పిటిసి,వైస్ ఎంపిపి,జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్,మార్కెట్ యార్డ్ కమిటీ చైర్మన్, పిఎసిఎస్ చైర్మన్,ఎంపిటిసిలు,సర్పంచులు,పలు శాఖల ఉన్నతాధికారులు,అధికారులు సకాలంలో హాజరు కావాలని ఎంపిడిఒ సూచించారు.



