రెవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం అనంతరం టపాసులు

రెవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం అనంతరం టపాసులు పేల్చి సంబురాలు చేసుకున్న నాయకులు

కందుకూరు,ప్రజాతంత్ర,డిసెంబర్ 7 : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎనుముల రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన శుభ సందర్బంగా కందుకూరు మండల పరిధిలోని లేమూర్ గ్రామములో కందుకూరు మండల ఎంపిటీసిల పోరం మాజీ అధ్యక్షుడు మూల హనుమంత్ రెడ్డి ఆద్వర్యంలో జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ ఛైర్మన్ కప్పాటి పాండురంగా రెడ్డి, అందుగుల సత్యనారాయణ,గోపిరెడ్డి సత్యనారాయణ రెడ్డి,జంగలి వీరేష్,మూల ఇంద్రారెడ్డి,రవీంద్రనాథ్,మదుకర్ రెడ్డి,పవన్ కుమార్ రెడ్డి,కాశంశెట్టి కిషన్,గూడూర్ రవీందర్ రెడ్డి,మహమ్మద్ హకీల్, బాస్కర్,బుక్క పాండురంగా రెడ్డి,అరవింద్ రెడ్డి,శ్రీకాంత్ రెడ్డి తదితరులు టపకాయలు,బాణసంచా పేల్సి  మిఠాయిలు పంచి సంబరాలు జరుపుకున్నారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ,
పోరాటాలతో,త్యాగల పునాదులతో ఏర్పడిన  తెలంగాణ రాష్ట్రం కెసిఅర్ తన సొంత జాగీరులా భావించి అభివృద్ధి పేరుతో రాష్ట్రాన్ని దివాలా తీయించారని అన్నారు. ఎన్నో ఆశయాలు,ఆకాంక్షలతో ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం రాచరిక దొరల పాలన కొనసాగించారు.కెసిఅర్ ప్రజాస్వామ్యాన్ని కూని చేసారని అన్నారు.కాంగ్రెస్ పాలనలో ప్రజాస్వామ్య పునరుద్దరనే ద్యేయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పనిచేస్తారని వారు పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *