రెండో విడత గొర్రెల పంపిణీకి అధికారులకు అవగాహన సదస్సులో పాల్గొన్న జిల్లా కలెక్టర్

సిద్దిపేట,ప్రజాతంత్ర, ఆగస్ట్ 26: రెండవ విడత గొర్రెల పంపిణీకి గొర్రెల కొనుగోలు కోసం వెళ్ళనున్న 4వ స్పెషల్ కమిటి అధికారులకు అవగాహన సదస్సులో పాల్గొన్న జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జే. పాటిల్ సమీకృత జిల్లా కార్యాలయ సముదాయంలోని కాన్పరెన్స్ హల్ లో జిల్లా పశుసంవర్ధకశాఖ, 4వ స్పెషల్ కమిటి అదికారులకు అవగాహన సదస్సు జిల్లా కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించారు.ఈ సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ…రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెండవ విడత గొర్రెల పంపిణీ కార్యక్రమం కోసం గొర్రెలు తీసుకురావడానికి జిల్లా అధికారులతో కూడిన 4వ స్పెషల్ కమిటీకి అనంతపురం, బళ్ళారి వెళ్లనున్నారు. 4వ కమిటీ సుమారు వారం రోజుల పాటు ఈ ప్రక్రియలో భాగంగా కోనుగోలు కేంద్రాలలో ఉంటారు. సమకూర్చిన వాహనంలో జిల్లా స్పెషల్ అధికారి, అసిస్టెంట్, లబ్ధిదారుడు, స్టేట్ నుండి ఇద్దరు వెటర్నరీ డాక్టర్ అందరు కలిసి గొర్రెలను నిబంధనలకు అనుగుణంగా ఎంపిక చేసుకుని జాగ్రత్తగా తీసుకుని వచ్చి లబ్ధిదారునికి అందజేయ్యాలని తెలిపారు. ఈ లాబ్ పోర్టర్ రిజిస్ట్రేషన్ లో పేర్లు వచ్చిన వాళ్లనె పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు. అలాగే తెలంగాణ గొర్రెల, మేకల అభివృద్ధి సహకార సమాఖ్య లిమిటెడ్ వారు జారీచేసిన పుస్తకంలోని అంశాలను అధికారులు అర్థం చేసుకుని గొర్రెల పంపిణీ ఎలా జరపాలో క్లుప్తంగా తెలుసుకుని జిల్లాలో అనుకున్న లక్ష్యం వారిగా పంపిణీ వ్యవస్థ జరపాలని అధికారులను ఆదేశించారు. అధికారులకు ఎవైనా సందేశాలు వచ్చిన జిల్లా పశుసంవర్ధకశాఖ శాఖలో హెల్ప్ సెంటర్ కి కాల్ చెయ్యాలని సూచించారు. అలాగే లబ్ధిదారులు కొంతమంది గొర్రెలు తీసుకున్న కొంత కాలానికే అమ్మడం జరిగితే చట్ట రీత్యా నేరారోపణలు ఎదురుకుంటారు. అందుకే గొర్రెల పంపిణీ వ్యవస్థలో ఉన్న అంతిమ లక్ష్యం నేరవేరేవరకు అధికారులూ తరచూ పర్యవేక్షణ చెయ్యాలి.ఈ కార్యక్రమంలో జిల్లా పశుసంవర్ధకశాఖ జెడి జగత్ కుమార్ రెడ్డి, డిఈఓ శ్రీనివాస్ రెడ్డి, సెరికల్చర్ ఎడి ఇంద్రసేనారెడ్డి, ఎడి మైనింగ్స్ రాఘవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *