రెండు రోజుల్లో అనాధల సమస్యలు పరిష్కరించాలి

ముషీరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 09 : రాష్ట్ర ప్రభుత్వం అనాధలకు ఇచ్చిన హామీలను రెండు రోజుల్లోగా పరిష్కరించాలని రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ ను కలసి వినతి పత్రం సమర్పించినట్లు అంజలీ తెలంగాణ అనాధ హక్కుల సంరక్షణ సంస్థ అధ్యక్షుడు బొక్క వెంకటయ్య సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సమస్యలపై మంత్రి స్పందిస్తూ తక్షణమే పరిష్కారం అయ్యే విధంగా సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చినట్లు తెలిపారు. ఈ సందర్బంగా వెంకటయ్య మాట్లాడుతూ తెలంగాణ రాష్టంలోని అన్ని జిల్లాల్లో ఉన్న అనాధలకు సిఎం కెసిఆర్ 24.06.2015 సం. నుండి అనాధలకు అన్నీ తామై ఉంటామని అనేక సార్లు సబ్ కమిటీ క్యాబినేట్ మంత్రుల సమావేశం ఏర్పాటు చేశారరని అన్నారు. అనాధలకు తల్లీ తండ్రిగా కుటుంబం అయ్యి స్థిరపడే వరకు ప్రభుత్వంమే సూసుకొంటుందని హామీ ఇచ్చి 9 సం.లు గడచినప్పటికీ క్యాబినెట్ మీటింగ్స్ జరుగుతనే వున్నాయి కానీ ఏ ఒక్కటి పరిష్కారం కాలేదన్నారు. ఇంటిగ్రెటెడ్ క్యాంపస్, ప్రతి జిల్లాకు అనాధలకు అమ్మాయిలకు ఒక్కటి అబ్బాయిలకు ప్రత్యేక రెసిడెన్సీయల్స్, ప్రతి సం. అసెంబ్లీలో ప్రత్యేక బడ్జెట్ ని కేటాయించి, మిగులు బడ్జెట్ ని గ్రీన్ ఛానల్ పెట్టి ఎక్కడ మల్లించకుండా అనాధలకు మాత్రమే ఖర్చు చేస్తామని, కులం, ఆదాయం, నివాసం లాంటి అవసరం లేకుండా ప్రత్యేక స్మార్ట్ కార్డులు ఇచ్చి కేజీ నుండి పీజీ వరకు పూర్తిగా ఉచితంగా ప్రభుత్వమే విద్యను అందజేస్తామని, దేశం గర్వించేవిధంగా అనాధలకు ప్రత్యేక చట్టం తెస్తామని, ఎవరైనా అనాధలపై దాడులు చేసినా బెదిరించినా ఎలాంటి హాని చేసిన పిడి యాక్ట్ చట్టం ప్రకారం కేసులు పెట్టి జైల్లో పెటిస్తామని, శాశ్వతంగా ఆర్థికంగా పూర్తిగా ప్రత్యేక భద్రత కల్పిస్తామని గతంలో మీటింగ్లో స్పష్టం చేశారని తెలిపారు. సిఎం వేసిన విచారణ కమిటీ పెండింగ్ లోనే ఉందన్నారు. తక్షణమే కమిటీ నుండి రిపోర్టును తెప్పించుకొని 40 కి పైగా డిమాండ్లను అమలు చేయాలన్నారు. రెండు రోజుల్లోగా పరిష్కారం చేయకపోతే ఆర్టికల్ 19 ప్రకారం స్త్రీ శిశు సంక్షేమ శాఖ కమీషనర్ కార్యాలయంతో పాటు రాష్ట్రంలోని అన్ని జిల్లా కలెక్టర్స్ కార్యాలయాల ఎదుట పెద్ద మొత్తంలో అన్ని రాజకీయ పార్టీలు, కుల సంఘంల పెద్దల సహకారంతో అందరి మద్దతు కూడగట్టుకుని అనాధల హరిగోస ఉద్యమం చేపడతామని హెచ్చరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *