రెండుగా చీలిన గుండె

మస్తిస్కాల్లో మతం రంగు సాలెగూళ్ళు అల్లుకున్నాయి
నరణరాల్లో ఇంకిపోయి గుండెని చీల్చుతుంది.
పవిత్ర పుణ్యభూమిపై ఇపుడు…
కులమతాల గుండె చప్పుడు.
అభివృద్ధి నినాదం మనకు అవసరం లేదు.
పేదవాడి ఆకలి కేకలు మనకు అక్కెరలేదు.
ఇక్కడ కాలాల్సింది మతం పేరున
రగిలించే మంటలు.
కులం పేరున కాల్చే కుంపట్లు.

బ్రాకెట్లో బందిలా బ్రతుకులు.
చూపుల్ని సున్నాలు చుట్టేస్తున్నాయి.
కళ్లముందర మతం రంగులే కనిపిస్తున్నాయి.
దాటిచూసే ధైర్యం ఎక్కడని.
దరిద్రం దాపురించి దునియాను దహిస్తున్నా..
నువ్వు మాత్రం సున్నాలా నీ చుట్టూ చుట్టునున్న
మతాల మడతల్లోంచి బయటకి రాకు.
అలా ఉన్నన్నినాళ్ళు నీబతుకు సున్నానే అనిమరవకు.

నా గుండెలోతుల్లోకి తొంగిచూడు.
నాలుగు గదులనిండా మూడు రంగుల జెండా.
ఎదలోని బాదంతా మువ్వన్నెల జెండాకు తెలుసు.
జాతీయ గీతాన్ని పైపైకే పాడుతున్నాను.
అసలైన బతుకు గీతం మనసులో పాడుతున్నాను.
ఆ గీతాన్ని మనసారా వింటుంది
మదిలో కొలువైన తీరంగా.
సమానత్వమని నువ్వు మాట్లాడవద్దు.
అలా మాట్లాడితే నువ్వు దేశద్రోహివి అవుతావు.

వజ్రోత్సవ భారతమా…ఇకనైనా
పేదవాడి కళలుకన్న నవభారత మార్గాన్ని చూపించు.
అవినీతి రహిత సమాజాన్ని నిర్మించు.
అధికారం చాటున కున్నారిల్లుతున్న…
తెల్లచొక్కాల దొరతనాన్ని నిలదీసి..
ఒక మంచి భారత దేశాన్ని మాకివ్వు.

– అశోక్‌ ‌గోనె
9441317361.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *