రెండవ రోజు కొనసాగిన యూత్ డిక్లరేషన్

కందుకూరు,ప్రజాతంత్ర ఆగస్టు 4 : ఇంటింటికి తిరిగి యూత్ డిక్లరేషన్ కార్యక్రమాన్ని కందుకూరు మండల పరిధిలోని సాయిరెడ్డి గూడ గ్రామంలో మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు దంతోజి నరసింహచారి ఆధ్వర్యంలో శుక్రవారం రెండవ రోజు కొనసాగింది. కాంగ్రెస్ పార్టీ యువజన కార్యకర్తలతో కలిసి ఆయన ప్రతి ఇంటింటికి తిరిగి గతంలో కాంగ్రెస్ చేసిన అభివృద్ధి పనులు ప్రజలకు ఆయన వివరించారు.తెలంగాణ ప్రభుత్వంలో ఉద్యోగాలు రాక యువతి,యువకులు నానా విదాలుగా బాధపడుతున్నారనే విషయాలను క్షుణ్ణంగా ప్రజలకు ఆయన వివరించారు.ఇంటింటికి తిరిగి ప్రచారం చేయాలన్నదే పార్టీ ఆలోచన విధానమని అందుకు పార్టీ అధిష్టానం తనకు ఆదేశాలు ఇవ్వగా యూత్ డిక్లరేషన్ యువతకు ప్రజలకు తెలపడం జరుగుతుందని ఆయన తెలిపారు.పార్టీ చేపట్టిన ఈ కార్యక్రమానికి యువతీ యువకుల నుండి మంచి స్పందన లభిస్తుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో గోరింక రమేష్,సకిలాల శ్రీను,ముద్దం శివ,మండల పవన్,మూడ బాలకృష్ణ,కొంగల అర్జున్,దెందె కుమార్,మండల మహేష్, తెరటి అశోక్,దువ్వాసి రవి,మండల భాస్కర్,కొంగల రాజు,బుడ్డోని మల్లేష్,ఊటు రాజు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *