రుద్రారంలో అంగరంగ వైభవంగా బోనాల పండగ

పటాన్ చెరు, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 11:రుద్రారం గ్రామంలో శ్రావణమాసంలో ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించడంతో ఎంతో ఆనందోత్సవం అమ్మవారి కృప నియోజకవర్గ ప్రజలపై ఉంటుందని ఎన్ఎంఆర్ యువసేన వ్యవస్థాపక అధ్యక్షులు నీలం మధు ముదిరాజ్ తెలిపారు.పటాన్ చెరు మండలం రుద్రారం గ్రామంలో శ్రావణమాసంలో నిర్వహించే పోచమ్మ తల్లి బోనాల కార్యక్రమానికి  నీలం మధు హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించి, అమ్మవారిని దర్శించుకున్నారు.ఈ సందర్భంగా యువకులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. శివాజీ యువజన సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన పలారం బండి, రవికాంత్  మిత్రబృందం ఆధ్వర్యంలో నిర్వహించిన పలారం బండి, మన్నే బిక్షపతి తొట్టెల కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్ఎంఆర్ యువసేన ద్వారా ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి సేవలు అందించేందుకు ఎప్పుడు సిద్ధంగా ఉన్నానని తెలిపారు.ప్రజా శ్రేయస్సు ధ్యేయంగా ముందుకు కదులుతున్నట్లు ఆయన చెప్పారు.ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు మన్నే ప్రభు,వంశీ, అల్లురిప్రభు,మహేష్,ప్రశాంత్,గణేష్,నరేష్,సతీష్,నాగరాజు,వెంకట్, సాయి రామ్,పాండు,రమేష్, గ్రామ పెద్దలు, ప్రజలు, ఎన్ఎంఆర్ యువసేన సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *