రుణమాఫీ నిధులను రైతుల ఖాతాల్లో వేయాలని వ్యవసాయ కమిషనర్ కు వినతి పత్రం అందజేసిన కాంగ్రెస్ నేతలు

కందుకూరు,ప్రజాతంత్ర,అక్టోబర్ 4 : మండల పరిధిలోని నేదునూరు, లేమూర్,రాచులూరు,గుమ్మడవెల్లి నాలుగు గ్రామాలలో గల కెనరాబ్యాంక్ నందు ప్రభుత్వం ప్రకటించిన రైతు రుణమాఫీ నిధులు రైతులకు వారి ఖాతాల్లో వేయాలని బుధవారం వైస్ ఎంపీపీ గంగుల శమంత ప్రభాకర్ రెడ్డి,జిల్లా కాంగ్రెస్ మైనార్టీ జనరల్ సెక్రటరీ యండి.అఫ్జల్ బేగ్ ల ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ కమిషనర్ కి, లీడ్ బ్యాంక్ జనరల్ మేనజేర్ కి,కెనరా బ్యాంక్ డివిజనల్ జనరల్ మేనజేర్ కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది.ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షులు చల్లా నర్సింహా రెడ్డి,మాజీ జడ్పీ ఫ్లోర్ లీడర్ ఏనుగు జంగారెడ్డి,పీసీసీ సెక్రటరీ ఎల్మటి అమరేందర్ రెడ్డి,పీసీసీ సభ్యులు దేపా భాస్కర్ రెడ్డి, ఎస్టీ సెల్ అధ్యక్షులు గణేష్ నాయక్,సీనియర్ నాయకులు బుక్క పాండు రంగారెడ్డి, ధనరాజ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *