రిమ్మనగూడలో ఇంటింటి ప్రచారంలో పాల్గొన్న చైర్మన్ మాదాసు శ్రీనివాస్

గజ్వేల్, ప్రజాతంత్ర, నవంబర్ 2: గజ్వేల్ మండల రిమ్మనగూడా గ్రామంలో భారస మండల అధ్యక్షుడు బెండే మధు ఆధ్వర్యంలో బీఆర్ఎస్ ఇంటింటి ఎన్నికల ప్రచారంలో పాల్గొని మార్కెట్ కమిటీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్ మాట్లాడారు.మంచి పనులెన్నో చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ ను మనం అందరం గెలిపించాలని కోరడం జరిగింది.ముచ్చటగా మూడోసారి ఎమ్మెల్యే గా కేసీఆర్  ను అఖండ మెజారిటీతో గెలిపించుకుందాం అని కోరుతూ ఈ రాష్ట్రనికి ముఖ్యమంత్రిగా కేసీఆర్ ని మళ్ళీ చేసుకుందాం అని విజ్ఞప్తి చేశారు. మంచి మెజారిటీ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ కి కానుకగా ఇవ్వాలని రాష్ట్రంలో మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ దే హైట్రిక్ విజయం అని కాంక్షించారు.గజ్వేల్ నియోజకవర్గనికి రాష్ట్ర వ్యాప్తంగా ఒక ప్రాముఖ్యతను తీసుకొచ్చిన గజ్వేల్ గడ్డ మీద గెలిచి గులాబీ జెండా ఎగురవేద్దాం అని అన్నారు. సంక్షేమ పథకాలకు కేరాఫ్ గా బీఆర్ఎస్ పార్టీ నిలిచిందని దేశానికి ఆదర్శంగా రాష్ట్రన్నీ గౌ ముఖ్యమంత్రి కేసీఆర్  తీర్చిదిద్దరాని అన్నారు.ఈ కార్యక్రమంలో ఎంపీపీ అమరావతి, జడ్పీటీసీ పంగ మల్లేశం, ప్యాక్స్ చైర్మన్ జె.వెంకటేష్ గౌడ్, రైతుబందు సమితి మండల అధ్యక్షుడు మద్ది రాజిరెడ్డి, వైస్ ఎంపీపి కృష్ణా గౌడ్, సమన్వయ సమితి సభ్యులు పందారి రవీందర్ రావు,మద్దూరి శ్రీనివాస్ రెడ్డి, దయాకర్ రెడ్డి, బొల్లారం ఎల్లయ్య, వెంకట్ నర్సింహారెడ్డి, నాయకులు రమేష్ గౌడ్ , బిమప్ప, కనకయ్య, శ్రీనివాస్, మురళి, బాల్ రాజు గౌడ్, రవి, సాయి, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *