రిజర్వ్ ‌బ్యాంక్‌ ‌కీలక నిర్ణయం

  • మార్కెట్‌ అం‌చనాలను నిజం చేస్తూ రెపోరేటు పెంపు
  • 35 బేసిస్‌ ‌పాయింట్లు పెంచుతున్నట్లు గవర్నర్‌ ‌ప్రకటన
  • మరింత భారం కానున్న రుణాలు

ముంబై, డిసెంబర్‌ 7 : ‌రిజర్వ్ ‌బ్యాంక్‌ ‌కీలక నిర్ణయం తీసుకుంది. మార్కెట్‌ అం‌చనాలను నిజం చేస్తూ వడ్డీ రేట్లు పెంచింది. రెపోరేటును 35 బేసిస్‌ ‌పాయింట్లు పెంచుతున్నట్లు ఆర్బీఐ గవర్నర్‌ ‌శక్తికాంత దాస్‌ ‌ప్రకటించారు. తాజా పెంపుతో రెపో రేటు 6.25శాతానికి పెరిగింది. ఈ ఏడాది ఆర్బీఐ వడ్డీ రేట్లు పెంచడం వరుసగా ఐదోసారి. ద్రవ్యోల్బణం కట్టడి, ఆర్థికవృద్ధి నెమ్మదించడం తదితర కారణాలతో ఆర్బీఐ వడ్డీ రేట్ల పెంపును కాస్త తగ్గించినట్లు తెలుస్తోంది. ద్రవ్యోల్బణాన్ని తగ్గించే ప్రయత్నంలో భాగంగానే వడ్డీ రేట్లు పెంచినట్లు ఆర్బీఐ గవర్నర్‌ ‌శక్తికాంత దాస్‌ ‌చెప్పారు. రష్యా, ఉక్రెయిన్‌ ‌యుద్ధ అనంతరం ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణం పెరిగిందని అన్నారు. 2023 ఆర్థిక సంవత్సరంలో రిటైల్‌ ఇన్‌?‌ప్లేషన్‌ ‌రేటు 6.7 శాతంగా ఉండొచ్చని రిజర్వ్ ‌బ్యాంక్‌ అం‌చనా వేస్తోంది. ఈ ఏడాది మేలో ఆర్బీఐ రెపో రేటును 40 బేసిస్‌ ‌పాయింట్లు పెంచింది. ఆ తర్వాత జూన్‌, ఆగస్టు, సెప్టెంబర్‌ ‌లోనూ 50 బేసిస్‌ ‌పాయింట్ల మేర పెంచింది. దీంతో రెపో రేటు 2019 ఏప్రిల్‌ ‌నాటి గరిష్ఠానికి చేరింది. ద్రవ్య విధానాన్ని ప్రకటించింది రిజర్వ్ ‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇం‌డియా.

మూడు రోజులుగా జరుగుతున్న రిజర్వ్ ‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇం‌డియా (ఆర్‌బీఐ) ద్రవ్య సక్ష విధాన సమావేశం బుధవారంతో ముగిసింది. సమావేశం అనంతరం కొత్త ఏడాదికి ముందే సామాన్యులకు షాక్‌ ఇస్తూ రెపో రేటును 35 బేసిస్‌ ‌పాయింట్లు పెంచుతున్నట్లు ఆర్బీఐ ప్రకటించింది. రెపో రేటు వడ్డీ రేటుపై ప్రభావం చూపుతుంది. దీంతో రెపో రేటు 6.25 శాతానికి పెరిగింది. అంతకుముందు సెప్టెంబర్‌ 30‌న సెంట్రల్‌ ‌బ్యాంక్‌ ‌రెపో రేటును 5.90 శాతానికి పెంచింది. ద్రవ్యోల్బణం ఇంకా ఆందోళనకరంగానే ఉందని ద్రవ్య సక్ష విధానాన్ని ప్రకటిస్తూ సెంట్రల్‌ ‌బ్యాంక్‌ ‌గవర్నర్‌ అన్నారు. రెపో రేటును 0.35 శాతం పెంచుతున్నట్లు ఆర్‌బీఐ గవర్నర్‌ ‌శక్తికాంత్‌ ‌దాస్‌ ‌బుధవారం ప్రకటించారు. ఆ తర్వాత రెపో రేటు 6.25 శాతానికి పెరిగింది. ఆర్ధిక నిపుణుల అంచనాలకు అనుగుణంగా ఆర్‌బీఐ రెపోరేట్లను మరో 35 బేసిస్‌ ‌పాయింట్లను పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది.

బ్యాంకులకు తానిచ్చే రుణాలపై సెంట్రల్‌ ‌బ్యాంక్‌ ‌వసూలు చేసే వడ్డీరేటు రెపో (ప్రస్తుతం 5.9 శాతం)ను తదుపరి దశల్లో పెంచే విషయంలో దూకుడు ధోరణిని ప్రదర్శించవద్దని ఆర్‌బీఐకు పారిశ్రామిక వేదిక అసోచామ్‌ ‌విజ్ఞప్తి చేసింది. రెపో రేటు పెరుగుదల బ్యాంకులు ఖాతాదారులకు ఇచ్చే రుణాలపై ప్రత్యక్ష ప్రభావం చూపుతుంది. దీంతో రుణం తీసుకునే ఖర్చు పెరుగుతుంది. ఈ ప్రభావం రు తీసుకున్న లోన్‌ ‌పై పడుతుంది. రు ప్రతి నెల చెల్లించే ఇఓఎ పెరుగుతుంది. రెపో రేటు పెంపు కారణంగా బ్యాంకుల రుణాల రేట్లు పెరగడం వల్ల వినియోగదారులపై ప్రభావం పడుతోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2022-23లో దేశ స్థూల జాతీయోత్పత్తి (జిడిపి) వృద్ధి అంచనాను ప్రపంచ బ్యాంకు మంగళవారం 6.5 శాతం నుంచి 6.9 శాతానికి పెంచింది. ఆర్‌బీఐ గవర్నర్‌ ‌శక్తికాంత్‌ ‌దాస్‌ ‌మాట్లాడుతూ.. మరో సంవత్సరం ముగింపునకు వచ్చిందని, దేశంలోనే కాకుండా ప్రపంచంలోని చాలా దేశాల్లో ద్రవ్యోల్బణం రేటు పెరుగుతూనే ఉంన్నాయి.

ప్రపంచ భౌగోళిక రాజకీయ పరిస్థితుల కారణంగా దేశంలో సరఫరా గొలుసు పరిస్థితి సవాళ్లను ఎదు ర్కొంటోంది. ద్రవ్యోల్బణం రేటు ఎగువ స్థాయిలోనే ఉండగా, బ్యాంక్‌ ‌క్రెడిట్‌ ‌వృద్ధి ప్రస్తుతం రెండంకెల కంటే ఎక్కువగా వస్తోందన్నారు. రిజర్వ్ ‌బ్యాంక్‌ ‌తన గత మూడు మానిటరీ పాలసీ కమిటీ సమావేశాల్లో రెపో రేటును మొత్తం 1.90 శాతం పెంచింది. ఇందులో మేలో 40 బేసిస్‌ ‌పాయింట్లు, జూన్‌, ఆగస్టులో 50-50 బేసిస్‌ ‌పాయింట్లు పెంచారు. ప్రస్తుతం రెపో రేటు 5.90 శాతంగా ఉండగా, నేడు ఆర్‌బీఐ రెపో రేటును 0.35 శాతం పెంచింది. దీంతో రెపో రేటులో 6.25 శాతానికి చేరుకుంది. రెపో రేటు అనేది ఆర్‌బిఐ ద్వారా ఏదైనా బ్యాంకు రుణం ఇచ్చే రేటు. దీని ఆధారంగానే బ్యాంకులు ఖాతాదారులకు రుణాలు ఇస్తాయి. ఇది కాకుండా, రివర్స్ ‌రెపో రేటు అనేది బ్యాంకులకు వారి డిపాజిట్లపై వడ్డీని ఇచ్చే రేటు. రెపో రేటును పెంచడం వలన, బ్యాంకులపై భారం పెరుగుతుంది. బ్యాంకులు వడ్డీ రేటును పెంచడం ద్వారా ఖాతాదారులకు భర్తీ చేస్తాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *