రిజర్వుడు బోగీలు లేకుండానే రైలు రాక

  • అయ్యప్ప భక్తుల ఆందోళనతో ఉద్రిక్తత
  • చర్యలు తీసుకుని బోగీలు తగిలించిన అధికారులు

విశాఖపట్టణం, డిసెంబర్‌ 15 : ‌రైల్వేశాఖ అధికారుల నిర్లక్ష్యంతో గురువారం ఉదయం విశాఖపట్నం రైల్వే స్టేషన్లో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. అయ్యప్ప భక్తుల కోసం వేసిన ప్రత్యేక బోగీలు రాకపోవడంతో స్వాములు ఆందోళనకు దిగారు. సంఘటన వివరాల్లోకి వెళితే ప్రతి గురువారం ఉదయం 7:25 గంటలకు  విశాఖపట్నం నుండి కొల్లం వెళ్లే కొల్లం ఎక్స్ ‌ప్రెస్‌(18567) ‌రైలులో ఎస్‌7, ఎస్‌8, ఎస్‌9 ‌బోగిలు లేకుండా ప్లాట్‌ ‌ఫారం నెంబర్‌ 8‌లో ప్రయాణానికి సిద్ధంగా ఉంచారు.

అప్పటికే ఈ మూడు బోగిలల్లో రిజర్వేషన్‌ ‌చేసుకున్న సుమారు 250 మంది అయ్యప్ప స్వాములు తాము ఎక్కవలసిన బోగీలు లేకపోవటంతో తీవ్ర ఆందోళనకు చెందుతూ రైలుకు అడ్డంగా నిలబడి నిరసనకు దిగారు. తప్పును గ్రహించిన రైల్వే అధికారులు వెంటనే మూడు భోగిలను జత చేసి సమస్యను పరిష్కరించారు. ఈ క్రమంలో కొల్లం వీక్లీ ఎక్స్ ‌ప్రెస్‌ ‌నాలుగు గంటల ఆలస్యంగా 11:25 గంటలకు నిమిషాలకు విశాఖపట్నం నుండి బయలుదేరింది. జరిగిన సంఘటనపై విచారణకు ఆదేశించామని విచారణ అనంతరం బాధ్యులపై చర్యలు చేపడతామని రైల్వే అధికారులు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *