రాహుల్‌ ‌ట్రక్కు ప్రయాణం

సమస్యలు తెలుసుకునేందుకే..: కాంగ్రెస్‌

‌న్యూదిల్లీ,ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ ‌డెస్క్,‌మే23:  కాంగ్రెస్‌ అ‌గ్రనేత రాహుల్‌ ‌గాంధీ తాజాగా ఓ భారీ ట్రక్కులో ప్రయాణించారు. దిల్లీ  నుంచి చండీగఢ్‌ ‌బయలుదేరిన ఆయన.. సోమవారం రాత్రి హరియాణా లోని అంబాలా నుంచి చండీగఢ్‌ ‌వరకు ట్రక్కులో ప్రయాణం చేశారు.  •త్రిపూట ప్రయాణ సమయంలో భారీ వాహనాల డ్రైవర్లు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకునేందుకు రాహుల్‌ ఇలా ట్రక్కులో ప్రయాణం చేసినట్లు కాంగ్రెస్‌ ‌నేతలు తెలిపారు. ఇందుకు సంబంధించిన వీడియోలను కాంగ్రెస్‌ ‌నేతలు, కార్యకర్తలు సోషల్‌ ‌డియాలో పోస్టు చేశారు. ప్రస్తుతం అవి వైరల్‌ అవుతున్నాయి. కాగా, అధికారిక కార్యక్రమాలు లేనందున, రాహుల్‌ ‌గాంధీ తన సోదరి ప్రియాంక గాంధీ వాద్రా ఉన్న సిమ్లాకు వెళ్తున్నట్లు తెలుస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *