హిమాయత్‌నగర్, ప్రజాతంత్ర, నవంబర్ 08 : తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉజ్వల భవిష్యత్ ఉన్న యువకులు తమ అమూల్యమైన ప్రాణాలు త్యాగం చేసి వారి కుటుంబాలకు ఎంతో నష్టం చేశారని, అందుకు వారికి భారత్ పబ్లిక్ వెల్ఫేర్ పార్టీ ఒక్కొక్కరికి రూ.1 కోటి ఇవ్వనున్నట్లు భారత్ పబ్లిక్ వెల్ఫేర్ పార్టీ ఛైర్మన్ టి.ఎన్.దాస్ తెలిపారు. తెలుగు భాషను అధికార భాషగా చేస్తామన్నారు. ఈ మేరకు బుధవారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ 2023 వ ఎన్నికల ప్రణాళిక విడుదల చేశారు. ప్రతిజిల్లాలో పత్రిక విలేకర్లకు ఇండ్లు కట్టించి ఇస్తామన్నారు. పేదవారు చనిపోతే గ్రామాల్లో రూ.20 వేలు పట్టణాలల్లో రూ.30 వేలు అదే రోజు ఇవ్వనున్నట్లు తెలిపారు. కౌలు రైతులకు రైతుబంధు ఇస్తామన్నారు. ప్రభుత్వ ఆఫీసులో పనులకై లంచాలు ఇచ్చేవారిని పట్టిస్తే ఉద్యోగికి నగదు బహుమతి ఇస్తామన్నారు. మొబైల్ కోర్టులు ఏర్పాటు చేస్తామన్నారు. పిడుగులు పడి చనిపోతే బాధితుని కుటుంబానికి రూ.5 లక్షల ఆర్థిక సహాయం అందిస్తామన్నారు. ఈ సమావేశంలో భారత్ పార్టీ వెల్ఫేర్ పార్టీ జనరల్ సెక్రటరీ సంగం జగదీశ్వర్, తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్ర సాధనలో ప్రాణాలర్పించిన వారి కుటుంబాలకు రూ.1 కోటి ఇస్తాం




