రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు

  • హైదరాబాద్‌లో కుండపోత…పలు జిల్లాల్లోనూ జోరుగా వానలు
  • మరో రెండ్రోజులు ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరిక
  • హైదరాబాద్‌కు రెడ్‌ అలర్ట్…‌పలు జిల్లాలకు ఆరేంజ్‌, ఎల్లో అలర్ట్ ‌జారీ

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 5 : ‌రాష్ట్ర వ్యాప్తంగా విసారంగా వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్‌ ‌సహా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో కుండపోతగా వర్షం కురుస్తున్నది. మంగళవారం తెల్లవారుజాము నుంచి ఎడతెరపి లేకుండా వాన పడుతూనే ఉంది. నగరంలోని ఖైరతాబాద్‌, అవి•ర్‌పేట, సోమాజీగూడ, నాంపల్లి, మలక్‌పేట, సైదాబాద్‌, ‌పాతబస్తీ, ఎల్బీనగర్‌, ‌సాగర్‌రింగ్‌రోడ్‌, ‌హస్తినాపురం, బీఎన్‌రెడ్డి, నాగోల్‌, ఉప్పల్‌, ‌హబ్సిగూడ, తార్నాక, ఈసీఐఎల్‌, ‌సికింద్రాబాద్‌, ‌బేగంపేట, అడ్డగుట్ట, మారేడుపల్లి, ప్యాట్నీ, ప్యారడైస్‌, ‌బోయిన్‌పల్లి, సుచిత్ర, కొంపల్లి, తిరుమలగిరి, అల్వాల్‌, ‌బొల్లారం, చిలకలగూడ, కూకట్‌పల్లి, హైదర్‌నగర్‌, ‌నిజాంపేట్‌, ‌ప్రగతినగర్‌, ‌కేపీహెబీ కాలనీ, ఆల్విన్‌ ‌కాలనీ, మియాపూర్‌, ‌కుత్భుల్లాపూర్‌, ‌బీహెచ్‌ఈఎల్‌, ‌కొండాపూర్‌, ‌మాదాపూర్‌, ‌గచ్చిబౌలి, జూబ్లీహిల్స్, ‌బంజారాహిల్స్, ‌పంజాగుట్ట, మెహదీపట్నంలో వాన దంచికొట్టింది.

దీంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. ఈ నేపథ్యంలో జీహెచ్‌ఎం‌సీ  అధికారులు, సిబ్బంది అప్రమత్తమయ్యారు. రోడ్లపై నీరు నిలువకుండా చర్యలు తీసుకున్నారు. వొచ్చిన నీరు వొచ్చినట్లే వెళ్లేలా చూస్తున్నారు. పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతారణ శాఖ ఇప్పటికే హెచ్చరించింది.

11 జిల్లాలకు ఆరెంజ్‌ ‌హెచ్చరికలు, 18 జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీచేసింది. జగిత్యాల, కరీంనగర్‌, ‌వికారాబాద్‌, ‌సంగారెడ్డి, మెదక్‌, ‌మహబూబ్‌నగర్‌, ‌నాగర్‌కర్నూల్‌ ‌జిల్లాల్లో అతిభారీ వర్షాలు పడతాయని, ఆయా జిల్లాలకు ఆరెంజ్‌ అలెర్ట్ ‌జారీ చేసింది. ఎల్లో అలర్ట్ ‌జారీచేసిన జిల్లాల్లో ఆసిఫాబాద్‌, ‌మంచిర్యాల, నిర్మల్‌, ‌నిజామాబాద్‌, ‌రాజన్న సిరిసిల్ల, భూపాలపల్లి, కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్‌, ‌హన్మకొండ, సిద్దిపేట, కామారెడ్డి, వనపర్తి, జోగులాంబ గద్వాల, హైదరాబాద్‌, ‌మేడ్చల్‌, ‌మల్కాజిగిరి, రంగారెడ్డి, యాదాద్రి, సంగారెడ్డి, వికారబాద్‌ ‌జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ను జారీచేసింది. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని చెప్పింది. మంగళవారం నుంచి బుధవారం వరకు మంచిర్యాల, నిర్మల్‌, ‌నిజామాబాద్‌, ‌జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్‌, ‌వరంగల్‌, ‌హన్మకొండ, జనగామ జిల్లాల్లో అక్కడక్క అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అంచనా వేసింది.

నగరానికి భారీ వర్షసూచన…అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక
రాజధాని హైదరాబాద్‌లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌కు రెడ్‌ అలర్ట్  ‌జారీచేసింది. ప్రజలు అవసరమైతే తప్ప బయటకు రాకూడదని సూచించింది. భారీ వర్షాల నేపథ్యంలో అధికారులను జీహెచ్‌ఎం‌సీ అప్రమత్తం చేసింది. మరోవైపు రెండె రోజులుగా ఎడతెరిపిలేకుండా వర్షం కురుస్తుంది. మంగళవారం కూడా భారీ వర్షం పడింది. సోమవారం రాత్రి నుంచి వర్షం కురుస్తూనే ఉంది. అధికారులు నిత్యం అందుబాటులో ఉండాలని ఆదేశించింది. డీఆర్‌ఎఫ్‌ ‌సిబ్బంది క్షేత్రస్థాయిలో ఉండాలని సూచించింది. ఇక రాత్రి నుంచి భారీ వర్షం కురుస్తుండటంతో హుస్సేన్‌సాగర్‌కు  భారీగా వరద వొచ్చే అవకాశం ఉన్నది. దీంతో ట్యాంక్‌బండ్‌లో వాటర్‌ ‌లెవల్స్ ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని అధికారులను జీహెచ్‌ఎం‌సీ ఆదేశించింది. అదేవిధంగా ఉస్మాన్‌సాగర్‌, ‌హిమాయత్‌ ‌సాగర్‌ను కూడా పర్యవేక్షిస్తూ గేట్లు ఎత్తివేయాలని ఆదేశాలు జారీచేసింది. మూసీ పరివాహక, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఇక నగరంలోని జంట జలాశయాలకు వరద పోటెత్తింది.

ఈ నేపథ్యంలో హిమాయత్‌ ‌సాగర్‌ ‌రెండు గేట్లను జలమండలి అధికారులు ఎత్తివేశారు. ప్రస్తుతం సాగర్‌లోకి 1200 క్యూసెక్కుల నీరు వస్తుండగా, 1373 క్యూసెక్కుల నీరు మూసీలోకి వెళ్తున్నది. సాగర్‌లో ఇప్పుడు 1763.20 అడుగుల వద్ద నీటిమట్టం ఉన్నది. పూర్తిస్థాయి నీటిమట్టం 1763.50 అడుగులు. వర్షం ఇలాగే కురుస్తుండటంతో హిమాయత్‌ ‌సాగర్‌ ‌మరో రెండు గేట్లను ఎత్తివేసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. గేట్లను ఎత్తివేయడంతో జంట జలాశయాల పరిసర ప్రాంత ప్రజలను అప్రమత్తం చేశామన్నారు. ఇక.. రంగారెడ్డి, వికారాబాద్‌ ‌జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తుండటంతో గండిపేటకు వరద వొచ్చి చేరుతున్నది.

మంగళవారం తెల్లవారుజాము నుంచి జీహెచ్‌ఎం‌సీ  వ్యాప్తంగా కుండపోతగా వర్షం కురుస్తూనే ఉన్నది. కొన్ని గంటలపాటు భారీ నుంచి అతి భారీ వర్షం  కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో హైదరాబాద్‌కు రెడ్‌ అలర్ట్  ‌జారీచేసింది. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని సూచించారు. కాగా, రాత్రి నుంచి కురుస్తున్న వర్షాలతో రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదయింది. మియాపూర్‌లో అత్యధికంగా 14 సెంటీవి•టర్ల వర్షం కురిసింది. ఇక బండ మైలారంలో 13.8 సెం.వి•., దుండిగల్‌ ‌ఫారెస్ట్ అకాడవి•లో 12.9 సెం.వి•., కూకట్‌పల్లి హైదర్‌నగర్‌లో 12.7 సెం.వి•., మాదాపూర్‌లో 10.7 సెం.వి•., శేరిలింగంపల్లి 11.45 సెం.వి•., షేక్‌పేటలో 11.9 సెం.వి•., బోరబండ 11.6 సెం.వి•., గాజుల రామారం 10.9 సెం.వి•., షాపూర్‌లో 10.6 సెం.వి•., బాచుపల్లి, రాయదుర్గంలో 10.1 సెం.వి•., ఖైరతాబాద్‌ 10.1 ‌సెం.వి•., రాజేంద్రనగర్‌లో 10 సెం.వి•., గచ్చిబౌలిలో 9.6 సెం.వి•., బహదూర్‌పురా 8.2 సెంటీవి•టర్ల వర్షపాతం నమోదయింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *