రాష్ట్ర మంత్రి సీతక్కను కలిసిన సర్పంచుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎల్ ఎన్ రెడ్డి 

 ఆమనగల్లు, ప్రజాతంత్ర డిసెంబర్ 13 : తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ మహిళా, శిశు, సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ(సీతక్క)ను తెలంగాణ రాష్ట్ర సర్పంచుల సంఘం అధ్యక్షుడు గూడూరు లక్ష్మీ నర్సింహ్మ రెడ్డి రాష్ట్ర కార్యవర్గ సభ్యులతో కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. రాష్ట్రవ్యాప్తంగా గడిచిన ఐదు సంవత్సరములలో సర్పంచులు గ్రామపంచాయతీలలో చేసిన పలు అభివృద్ధి పనుల వివరాలను మంత్రికి తెలియజేశారు. అదేవిధంగా సర్పంచులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను గురించి  మంత్రికి వివరించడం జరిగిందనీ తెలిపారు. సానుకూలంగా స్పందించిన మంత్రి త్వరలోనే సర్పంచులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిశీలించి పూర్తిస్థాయిలో పరిష్కరిస్తామని, సర్పంచులు అందరూ గ్రామాల అభివృధ్యే లక్ష్యంగా పని చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో వ్యవస్థాపక అధ్యక్షులు భూమన్న యాదవ్, మహిళా అధ్యక్షురాలు జూలూరు ధనలక్ష్మి, కార్యవర్గ సభ్యులు వెంకటేష్, రామేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *