రాష్ట్ర ప్రభుత్వ నియంత పాలన ను సాగనివ్వం

షాద్ నగర్ ప్రజా తంత్ర అక్టోబర్ 31:షాద్ నగర్ నియోజక వర్గంలో అధికార పార్టీ నియంతృత్వ పోకడలను అరాచకాలను అరికట్టే వరకు నిద్రపోమని షాద్ నగర్ పీడ విరగడయ్యే సమయం ఆసన్నమైందని కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ అభ్యర్థి వీర్లపల్లి శంకర్ అన్నారు. మంగళవారం పట్టణంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వీర్లపల్లి శంకర్ మాట్లాడారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్ రెడ్డి మాజీ జెడ్పిటిసి శ్యాంసుందర్ రెడ్డి తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా శంకర్ మాట్లాడుతూ రేపు సాయంత్రం 6 గంటలకు కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ వస్తున్నారని తన ఎన్నికల ప్రచారం కోసం ఇక్కడికి రావడం ఇక్కడ కార్యకర్తలు చేసుకున్న అదృష్టమని అన్నారు. గత పది ఏళ్లుగా ప్రభుత్వ పోకడల నుండి ఎన్నో కష్టాలను ప్రజలతో సహా అనుభవించామని అన్నారు. రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమని ప్రతి గ్రామంలో ప్రజల నుండి స్వచ్ఛందంగా వస్తున్న స్పందన చూసి తనకు ఓటమి భయం లేదని అన్నారు. మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి, శ్యాంసుందర్ రెడ్డి రాకతో నియోజకవర్గంలో ఒక కొత్త వెలుగు వచ్చిందని అన్నారు. ప్రజలు టిఆర్ఎస్ పాలనపై తిరగబడే రోజులు ఆసన్నమయ్యాయని  అన్నారు.  రాహుల్ గాంధీ పర్యటనను విజయవంతం చేయండి
కార్యకర్తలకు పిలుపు కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ రేపు సాయంత్రం షాద్ నగర్ పట్టణంలో 6 గంటలకు కేశంపేట చౌరస్తా రోడ్డు నుండి మెయిన్ రోడ్డు మీదుగా చౌరస్తాకు చేరుకుంటారని ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తరఫున భారీ ప్రచారం స్వయంగా నిర్వహించబోతున్నారని వీర్లపల్లి శంకర్ వివరించారు. నియోజకవర్గం నుండి ప్రజలు కార్యకర్తలు అభిమానులు పార్టీ నాయకులు ప్రజాప్రతినిధులు అన్ని వర్గాలు, మహిళలు పెద్ద ఎత్తున తరలిరావాలని, కాంగ్రెస్ పార్టీకి బాసటగా నిలవాలని వీర్లపల్లి శంకర్ పిలుపునిచ్చారు. గ్రామాల్లో వస్తున్న స్పందన చూసి గెలుపు పై కార్యకర్తలు దీమా పెంచుకున్నారని ఈ సందర్భంగా అన్నారు. మొట్టమొదటిసారి పార్టీ అధినేత తన నియోజకవర్గంలో ప్రచారం చేయబోతున్నారని ఇది ఎంతో అదృష్టమని, రాహుల్ గాంధీ రుణపడి ఉంటానని శంకర్ అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *