రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా స్వతంత్ర భారత వజ్రోత్సవ ద్విసప్తాహం..!

సీఎమ్ కేసీఅర్ అధికారులకు ఆదేశాలు..
దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏండ్లు పూర్తవుతున్న సందర్భంగా స్వాతంత్ర్య సమరయోధులు, మహనీయుల త్యాగాలు, పోరాట ఫలాలు నేటి తరానికి అర్థమయ్యేలా, దేశభక్తిని ద్విగుణీకృతం చేసేలా రాష్ట్రవ్యాప్తంగా కార్యక్రమాలు రూపొందించాలని, గడప గడపకూ, వాడ వాడనా జాతీయ పతాకాన్ని ఎగురవేయాలని, క్రీడాపోటీలు, వక్తృత్వ పోటీలు, వ్యాసరచన పోటీలు, కవి సమ్మేళనాలు, జాతీయ భావాలను రగలించే సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించాలని ముఖ్యమంత్రి  కె. చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు.
స్వతంత్ర భారత వజ్రోత్సవ ద్విసప్తాహం:
స్వాతంత్ర్య దినోత్సవం రోజైన 15 అగస్టుకు ముందు 7 రోజులు అనంతరం 7 రోజులు మొత్తం 15 రోజుల పాటు రాష్ట్రంలో ‘భారత స్వతంత్ర వజ్రోత్సవ ద్విసప్తాహ’ కార్యక్రమాలు నిర్వహించాలని సీఎం అన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా 75 ఏండ్ల ‘ స్వతంత్ర భారత వజ్రోత్సవ ద్వి సప్తాహం’ నిర్వహణపై శనివారం
 ప్రగతి భవన్ లో సీఎం ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *