- మరోనాలుగు రోజులపాటు భారీ వర్షం హెచ్చరిక
- ప్రాజెక్టులకు భారీగా వొచ్చి చేరుతున్న నీరు
- పొంగిపొంగుతున్న వాగులు, వంకలు
- పలు ప్రాంతాల్లో రాకపోకలకు తీవ్ర అంతరాయం
- స్కూళ్లకు రెండ్రోజుల పాటు సెలవుల ప్రకటన
- వైద్యశాఖను అప్రమత్తం చేసిన మంత్రి హరీష్ రావు
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 20 : రాష్ట్ర వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. అల్పపీడన ప్రభావంతో మరో నాలుగు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. గత రెండు రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా కురుస్తున్న వర్షాలతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. చెరువులు, కుంటాలు అలుగు పోస్తున్నాయి. పలుచోట్ల రోడ్లు తెగిపోయి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. భారీ వర్షాల కారణంగా రాష్ట్రంలో విద్యాసంస్థలకు రెండ్రోజుల పాటు సెలవు ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలకు తెలంగాణ తడిసిముద్దయింది. చెరువులు, ప్రాజెక్ట్‌లు నిడుకుండలా మారాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కాగా, జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు సోలామైల్ వద్ద జనగామ-సిద్దిపేట జాతీయ రహదారి కొట్టుకుపోయింది. మరోవైపు అల్పపీడన ప్రభావంతో మరో నాలుగు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లొద్దని అధికారులు సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి.
అల్పపీడన ప్రభావంతో మరో నాలుగు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. మహబూబాబాద్, సూర్యాపేట, వరంగల్, హనుమకొండ, భదాద్రి, ఖమ్మం, జనగామ, యాదాద్రిలో అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. భూపాలపల్లి, సంగారెడ్డి, మెదక్, మేడ్చల్, రంగారెడ్డి, హైదరాబాద్, వికారాబాద్‌లో భారీ వర్షాలు కురవనున్నాయి. గోదావరి వరదల కారణంగా హైదరాబాద్ నుంచి ములుగు జిల్లా వి•దుగా ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం భూపాలపట్నంకు వెళ్లే 163 జాతీయ రహదారిపై టేకులగూడెం గ్రామశివారులో రహదారి పైకి గోదావరి వరద చేరడంతో రెండు రాష్ట్రాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వరద తగ్గేంత వరకు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని అధికారులు సూచించారు. రెండు మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు రాష్ట్రంలోని ప్రాజెక్టులు నిండుకుండల్లా మారుతున్నాయి. కాళేశ్వరం దగ్గర గోదావరి, ప్రాణహిత నదులు పరవళ్లు తొక్కుతున్నాయి. పుష్కరఘాట్ వద్ద 9.770 వి•టర్ల ఎత్తులో ఈ రెండు నదులు ప్రవహిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో మేడిగడ్డ, లక్ష్మీ బ్యారేజ్ 57 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. 4,85,030 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. లక్ష్మీబ్యారేజ్ ఇన్ ఫ్లో 4,38,880 క్యూసెక్కులు కాగా.. ఔట్ ఫ్లో 4,85,030 క్యూసెక్కులుగా ఉంది. భద్రాచలం వద్ద కూడా గోదావరిలోకి భారీగా వరదనీరు వొచ్చి చేరుతున్నది. ఇప్పటికే ఇక్కడ నీటిమట్టం 40 అడుగులకు చేరింది. 43 అడుగులకు చేరితే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉంది. కడెం ప్రాజెక్టు పూర్తిస్తాయి నీటి మట్టం 700 అడుగులు కాగా, 690.500 అడుగులకు చేరింది. ప్రస్తుతం కడెం ప్రాజెక్టుకు 7,283 క్యూసెక్కుల ఇన్ ఫ్లో ఉంది. దీంతో ఒక గేటును రెండు అడుగుల మేర ఎత్తి 2,865 క్యూసెక్కుల నీటిని కిందకు విడుదల చేస్తున్నారు. కుమ్రంభీం ప్రాజెక్టులో ప్రస్తుత నీటిమట్టం 237 అడుగులుగా ఉంది. కుమ్రంభీం ప్రాజెక్టు ప్రస్తుత ఇన్ ఫ్లో 2,400 క్యూసెక్కులు కాగా, ఔట్ ఫ్లో 1040 క్యూసెక్కులుగా ఉంది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు కూడా నీటి ప్రవాహం పెరిగింది. ఇన్ ఫ్లో 33,050 క్యూసెక్కులు కాగా, ఔట్ ఫ్లో 1046 క్యూసెక్కులుగా ఉంది. ఎస్సారెస్పీ ప్రస్తుత నీటిమట్టం 1072 అడుగులకు చేరింది. జనగామ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు సోలామైల్ వద్ద జనగామ-సిద్దిపేట జాతీయ రహదారి కొట్టుకుపోయింది.
దీంతో జనగామ నుంచి సిద్దిపేట వెళ్లే ప్రయాణికులు బచ్చన్నపేట, కొడవటూరు వయా బండానాగారం, సలాకపురం వి•దుగా ప్రయాణం సాగిస్తున్నారు. అన్ని జిల్లాల వైద్య శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి హరీష్ రావు ఆదేశించారు. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రజలకు అవసరమైన వైద్య సేవలు అందించాలని ఆదేశాలు జారీ చేశారు. కాగా, భారీ వర్షాల నేపథ్యంలో వైద్యారోగ్య శాఖ ఉన్నతాధికారులతో ఆ శాఖ మంత్రి హరీష్ రావు ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. ప్రజారోగ్య పరిరక్షణ విషయంలో తీసుకోవాల్సిన ముందు జాగ్రత్తలపై సవి•క్షించనున్నారు. భారీ వర్షాల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని విద్యాసంస్థలకు రెండు రోజులు సెలవులు ప్రకటిస్తూ విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు అన్ని విద్యాసంస్థలకు ఇవాళ, రేపు సెలవులు ప్రకటించామని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు.అల్పపీడన ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా రెండు రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి.
48 గంటలుగా ఎడతెరిపిలేని వానలతో అనేక ప్రాంతాల్లో జనజీవనం స్తంభించింది. జనగామ జిల్లా జాఫర్‌గఢ్‌లో అత్యధికంగా 18.5 సెంటీవి•టర్ల వర్షపాతం నమోదైంది. యాదాద్రి జిల్లా రాజాపేట్‌లో 17.1 సెం.వి•., మెదక్ జిల్లా ఎల్దుర్తిలో 14.6 సెం.వి•., కుమ్రంభీం జిల్లా బెజ్జూర్‌లో 14.1 సెం.వి•., వరంగల్ జిల్లా పర్వతగిరిలో 13.9 సెం.వి•., సిద్దిపేట జిల్లా తొగులలో 13 సెం.వి•., భదాద్రి జిల్లా ఆళ్లపల్లిలో 11.8 సెం.వి•., కామారెడ్డి జిల్లా గాంధారిలో 11.5 సెం.వి•., సంగారెడ్డి జిల్లా ఆందోలులో 11.4 సెం.వి•. వర్షపాతం నమోదైంది. నిజామాబాద్ జిల్లా ఇందల్వాయిలో 9.4 సెం.వి•., మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తిలో 8.4 సెం.వి•., ములుగు జిల్లా వెంకటపురంలో 7.6 సెం.వి•., రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లిలో 7.3 సెం.వి•., హైదరాబాద్ షేక్‌పేటలో 6.6 సెం.వి•.,ఖైరతాబాద్‌లో 4.7 సెం.వి•., మేడ్చల్-మల్కాజ్‌గిరి జిల్లా కూకట్‌పల్లిలో 5.6 సెం.వి•., కుత్బుల్లాపూర్‌లో 4.7 సెం.వి•., సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరులో 4.5 సెం.వి•. వర్షపాతం నమోదైంది.నైరుతి రుతుపవనాల ద్రోణి, కొంతమేరకు తెలంగాణ వైపునకు వచ్చిందని వాతావరణ విభాగం సంచాలకు రాలు డాక్టర్ నాగరత్న తెలిపారు.
అల్పపీడన ప్రభావంతో వచ్చే నాలుగు రోజులు కూడా భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు. ఆగస్టు మొదటి వారం వరకు తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని పేర్కొన్నారు. దీంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో అధికారులు జలాశయాల్లో నీటి మట్టం, ఎత్తు తక్కువ కల్వర్టులు, రహదారులు, లోతట్టు ప్రాంతాలపై నిఘా ఉంచి ఎప్పటికప్పుడు పరిస్థితిని సవి•క్షిస్తున్నారు. పలు జిల్లాల కలెక్టరేట్లలో ఇప్పటికే కంట్రోల్ రూమ్‌లను, హెల్ప్‌డెస్క్‌లను ఏర్పాటు చేశారు.




