8 ఏళ్లలో 65.95 లక్షల కోట్ల బ్యాంక్ లింకేజీ కల్పించిన రాష్ట్ర ప్రభుత్వం
సంఘాల ఉత్పత్తులకు దేశ, విదేశాల్లో మార్కెటింగ్ అవకాశాలు
ఈ-కామర్స్ సంస్థలతో ఒప్పందం
హైదరాబాద్, సెప్టెబర్ 30 : జనాభాలో సగమైన మహిళలు సాధికారత పొందకుండా నవభారత స్వప్నం సాకారం కావడం అసంపూర్ణమే అవుతుంది. ఈనాడు మహిళల ప్రభావం విద్య, విజ్ఞానం, రాజకీయం. వ్యాపారం, క్రీడలు తదితర రంగాలన్నింటి లోనూ విస్తరిస్తుంది. ఈ వాస్తవాలను గుర్తించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని మహిళల సమగ్ర వికాసానికి అనేక కార్యక్రమాలను చేపట్టి అమలు చేస్తున్నది. అందులో భాగంగానే మహిళలను సంఘటిత శక్తిగా తయారుచేయడమే లక్ష్యంగా మహిళా స్వయం సహాయక సంఘాలను రాష్ట్ర వ్యాప్తంగా బలోపేతం చేస్తున్నది.
తెలంగాణ రాష్ట్రంలోని మహిళలలో దాగిఉన్న శక్తిని సమాజానికి ఉపయోగపడటానికి రాష్ట్ర ప్రభుత్వం పట్టణ ప్రాంతాలతో పాటు గ్రామీణ ప్రాంతాలలో మహిళా స్వయం సహాయక సంఘాలను ఏర్పాటు చేసింది. మహిళలను పొదుపు వైపు మళ్ళించడం ద్వారా ఆ కుటుంబాన్ని ఆర్థికంగా బలోపేతం చేయడం, అదే సమయంలో కుటుంబాలను ఆర్థిక క్రమ శిక్షణ వైపు మళ్లించడం సంఘాల ఏర్పాటులో ముఖ్య ఉద్దేశం. రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాలలో 4,30,648 మహిళా స్వయం సహాయక సంఘాలు ఉన్నాయి. ఈ సంఘాలలో 46,09,843 మంది సభ్యులు ఉన్నారు. గ్రామాలలో మహిళా సంఘాల ద్వారా తీసుకున్న రుణాల వల్ల అనేక మంది మహిళల స్వయం ఉపాధి అవకాశాలు మెరుగు పడ్డాయి. ఈ కార్యక్రమం పటిష్టంగా అమలు చేయడానికి రాష్ట్రంలో 32 జిల్లా సమాఖ్యలు 553 మండల సమాఖ్యలు, 17,980 గ్రామ సమాఖ్యలు పనిచేస్తున్నాయి.
రాష్ట్రంలో సెర్ప్ ద్వారా గ్రామీణ ప్రాంతాల లోని స్వయం సహాయక సంఘాలకు గత 8 ఏండ్ల కాలంలో తెలంగాణ రాష్ట్రంలో(2014-15 నుండి 2021-22 వరకు) 65 వేల కోట్ల 35 లక్షల రూపాయలు బ్యాంకు లింకేజీ కల్పించబడిందని రాష్ట్ర పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తరువాత స్వయం సహాయక సంఘాలకు బ్యాంకు లింకేజి గణనీయంగా పెరిగిందని, 2014-15 ఆర్థిక సంవత్సరంలో 1,96,447 స్వయం సహాయక సంఘాలకు 3692 కోట్ల రూపాయల బ్యాంకు లింకేజీ కల్పించగా, సంవత్సరం 2021-22 లో 2 లక్షల 56 వేల 779 మహిళా స్వయం సహాయక సంఘాలకు 12,200 కోట్ల 59 లక్షల రూపాయల బ్యాంకు లింకేజీ కల్పించబడిందని ఆయన తెలిపారు. లింకేజీ 2022-23 ఆర్థిక సంవత్సరంలో సెర్ప్ ద్వారా 3,70,825 మహిళా స్వయం సహాయక సంఘాలకు 15001 కోట్ల 15 లక్షల రూపాయల బ్యాంకు లింకేజీ కల్పించాలని లక్ష్యంగా నిర్ణయించబడగా, ఇప్పటి వరకు 1,18,118 మహిళా స్వయం సహాయక సంఘాలకు 6887 కోట్ల 31 లక్షల రూపాయల బ్యాంకు లింకేజీ కల్పించబడిందని, మిగతా లక్ష్యాన్ని 2023 మార్చి నెలాఖరులోగా సాధించడానికి ప్రత్యేక కార్యాచరణ రూపొందించి చేయబడుతున్నదని ఆయన తెలిపారు.
సెర్ప్ ఫ్లిప్ కార్ట్ ఒప్పదం
రాష్ట్రంలో గ్రామీణ మహిళా సంఘాల ఉత్పత్తులను దేశ, విదేశాలలో విస్తృత మార్కెటింగ్ అవకాశాలు కల్పించేందుకు ఈ కామర్స్ సంస్థ(సెర్ప్) ఒప్పందం కుదుర్చుకొంది. 140 రకాల ఉత్పత్తులను ఫ్లిప్ కార్ట్ ద్వారా ఆన్ లైన్లో విక్రయచేందుకు ఈ ఒప్పందం వీలు కల్పిస్తుంది. ఈ విధమైన ఎంఓయూ దేశంలోనే తొలిసారి. ఈ ఏడాది 500 కోట్లు రూపాయల వ్యాపారం లక్ష్యంగా ఈ ఒప్పందాన్ని కుదుర్చుకోబడింది. ఈ ఒప్పందంలో స్థానికంగా ఉపాధి, ఉద్యోగావకాశాలు పెరుగుతాయన్నారు. మహిళా సంఘాల 30 ఏళ్ల ప్రయాణానికి ఈ ఒప్పందం మంచి మార్గమని, దీని వల్ల మహిళా సంఘాల ఉత్పత్తులకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మార్కెటింగ్ అవకాశాలు ఏర్పడుతాయి.
సెర్ఫ్ లిప్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఒప్పందం
మహిళా సంఘం ఉత్పత్తులైన ఎండుమిర్చి మార్కెటింగ్ కోసము ఈ కామర్స్ సంస్థ ప్లాట్ లిపిడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ లో సెర్ఫ్ ఇటీవల ఒప్పందం కుదిర్చుకుంది. ఈ ఏడాది 200 కోట్ల రూపాయలు వ్యాపారం లక్ష్యంగా ఈ ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్రంలో మహిళా స్వయం సహాయక సంఘాలు ఎంతో అభివృద్ధి చెందుతున్నాయి ఈ సంఘాల ద్వారా మహిళలలో పొదుపు చేయాలనే చైతన్యం గణనీయంగా పెరిగింది. వీరందరూ పొదుపు చేసుకుంటూ బ్యాంకుల ద్వారా వడ్డీలేని రుణాలు పొందుతున్నారు. క్రమం తప్పకుండా చెల్లిస్తున్నారు. 2021-22వ సంవత్సరంలో రుణాల రికవరీ రేటు 98 శాతంగా ఉంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటికి 2014 సంవత్సరంలో బ్యాంకు రుణం గ్రూప్ ఒక్కంటికి రూపాయలు 1.9 లక్షల రూపాయలు ఉండగా, 2022 సంవత్సరం నాటికి 5.41 లక్షల రూపాయలకు చేరుకుంది. గ్రామాలలో మహిళా సంఘాల ద్వారా తీసుకున్న రుణాలతో అనేక మంది మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యుల ఉపాధి అవకాశాలు మెరుగుపడ్డాయి. మహిళలు వారికున్న నైపుణ్యంతో అనేక వస్తువులను తయారు చేస్తున్నారు. వారు తయారు చేసిన వస్తువులను విక్రయించడానికి మేలాలు నిర్వహించ బడుతున్నాయి. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలలోపాటు రాష్ట్రంలోని వివిధ జిల్లా కేంద్రాలలో ఏర్పాటు చేస్తున్న విక్రయ స్టాల్స్‌లో తెలంగాణ మహిళలు పాల్గొని తాము తయారు చేసిన వస్తువులను ప్రదర్శించి, విక్రయిస్తున్నారు. దేశంలోనే కాకుండా బంగ్లాదేశ్ సహా అనేక దేశాలలో ప్రదర్శనకు తెలంగాణ మహిళలు హాజరయ్యారు. నిత్యం ప్రజలు ఉపయోగించే వస్తువులను స్థానికంగా ఉత్పత్తి చేయడంలో శిక్షణ ఇచ్చి వారిని తయారీ రంగం వైపు మళ్ళిస్తున్నది.