కొత్తగా 1054 మందికి పాజిటివ్
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 02 : రాష్ట్రంలో రోజువారీ కొరోనా కొత్త కేసులు మళ్లీ వేయి దాటాయి. మంగళవారం సాయంత్రం 5.30 గంటల వరకు గడిచిన 24 గంటల్లో 1054 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రాష్ట్ర వైద్యారోగ్య శాఖ విడుదల చేసిన బులెటిన్ ప్రకారం తాజాగా 1054 కొరోనా కేసులు నమోదు కాగా హైదరాబాద్ జిల్లాలో కొత్తగా 396 కేసులు నమోదవగా, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లాలలో 60 కేసులు, నల్గొండ జిల్లాలో 49 కేసులు నమోదయ్యాయి.
రాష్ట్రంలో ఇప్పటి వరకూ నమోదయిన మొత్తం కేసుల సంఖ్య 8,21,671 కాగా, మొత్తం మృతుల సంఖ్య 4,111గానే ఉంది. ఇప్పటి వరకూ మొత్తం కోలుకున్న వారి సంఖ్య 8,11,568 కాగా యాక్టివ్ కేసుల సంఖ్య 5,992గా ఉన్నట్టు వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులెటిన్‌లో పేర్కొంది.




