రాష్ట్రంలో మరోమారు జోరు వర్షాలు

  • జంటనగరాల్లో రెండ్రోజులుగా వానలు…జిహెచ్‌ఎం‌సి అప్రమత్తం
  • మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు పడొచ్చని వాతావరణ శాఖ హెచ్చరిక
  • ఉమ్మడి నిజామాబాద్‌లో భారీ వర్షాలు….శ్రీరాం సాగర్‌కు పోటెత్తిన వరద

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 4 : అల్పపీడన ప్రభావంతో వొచ్చే మూడు రోజులపాటు పలు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు వర్షాలు కురిసే సూచనలున్నాయని హైదాబాద్‌ ‌వాతావరణ శాఖ తెలిపింది.  నిజామాబాద్‌, ‌జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్‌, ‌పెద్దపల్లి, వికారాబాద్‌, ‌సంగారెడ్డి, మెదక్‌, ‌కామారెడ్డి, మహబూబ్‌నగర్‌, ‌నారాయణపేట జిల్లాల్లో అక్కడక్కడ అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, ‌మంచిర్యాల, నిర్మల్‌, ‌భూపాలపల్లి, ములుగు, నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్‌, ‌వరంగల్‌, ‌హనుమకొండ, జనగామ, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, నాగర్‌కర్నూల్‌, ‌వనపర్తి, జోగులాంబ గద్వాల్‌ ‌జిల్లాల్లో భారీ వానలు పడే అవకాశం ఉందని చెప్పింది. మంగళవారం నుంచి బుధవారం వరకు నిజామాబాద్‌, ‌జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్‌, ‌పెద్దపల్లి, వికారాబాద్‌, ‌సంగారెడ్డి, మెదక్‌, ‌కామారెడ్డి, మహబూబ్‌నగర్‌ ‌జిల్లాలకు అతిభారీ వర్ష సూచన ఉన్నదని వాతావరణ శాఖ వివరించింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఆరెంజ్‌, ఎల్లో అలర్ట్ ‌జారీ చేసింది. ఇక సోమవారం ఉదయం నుంచి రాష్ట్రవ్యాప్తంగా జోరుగా వర్షం కురుస్తున్నది.

దీంతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వీటికితోడు ఎగువ ప్రాంతాల నుంచి వరద వొస్తుండటంతో ప్రాజెక్టుల్లో నీటిమట్టం క్రమంగా పెరుగుతున్నది. హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి, హైదర్‌నగర్‌, ‌నిజాంపేట, ప్రగతినగర్‌, ‌మియాపూర్‌, ‌చందానగర్‌, ‌లింగంపల్లి, కొండాపూర్‌, ‌మాదాపూర్‌, ‌గచ్చిబౌలి, రాయదుర్గం, కుత్బుల్లాపూర్‌, ‌బహదూర్‌పల్లి, సూరారం, సుచిత్ర, జీడిమెట్ల, జగద్గిరిగుట్ట, బాలానగర్‌ ‌ప్రాంతాల్లో ఉదయం నుంచి వర్షం కురుస్తున్నది. హైదరాబాద్‌ ‌నగరానికి వాతావరణ శాఖ భారీ వర్ష సూచన చేసింది. హైదరాబాద్‌ ‌మహా నగరంలో ఆదివారం తెల్లవారుజామున భారీ వర్షం కురిసింది. అలాగే సోమవారం ఉదయం నుంచి వర్షం కురుస్తూనే ఉంది.  అర్ధరాత్రి తర్వాత చినుకులతో మొదలై.. ఉదయం 6 గంటల నుంచి గంటన్నర పాటు దంచి కొట్టింది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయ మయ్యాయి. అవి•ర్‌పేట, మైత్రీవనం, మయూర్‌ ‌మార్గ్‌తో పాటు పలు ప్రాంతాల్లో ప్రధాన రహదారులపై భారీగా వరద నిలిచిపోవడంతో ఉదయం బయటకు వచ్చిన వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పలు భవనాల్లో సెల్లార్లలోకి, నార్సింగ్‌ ‌మున్సిపాలిటీ బాలాజీనగర్‌ ‌కాలనీలో పలు ఇళ్లల్లోకి వరద నీరు చేరింది.

మణికొండ మున్సిపాలిటీ పరిధిలోని పందెంవాగు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో రాకపోకలు నిలిచిపోయాయి. తెల్లవారుజామున కురిసిన వర్షంతో వాతావరణం మారడంతో నగరవాసులు ఊపిరి పీల్చుకున్నారు. ఆదివారం సెలవురోజు కావడంతో ఉదయం వేళ ట్రాఫిక్‌ ‌సమస్యలు తలెత్తలేదు. ఆరు నుంచి 7.30 వరకు కురిసిన భారీ వర్షంతో రహదారులు చెరువులను తలపించాయి. బోరబండలో అత్యధికంగా 8.8 సెం.వి• వర్షపాతం నమోదైంది. రోడ్లపై నిలిచిన నీటిని బయటకు పంపించేందుకు జీహెచ్‌ఎం‌సీ డీఆర్‌ఎఫ్‌ ‌సిబ్బంది చర్యలు చేపట్టారు. సీజన్‌ ‌ప్రారంభమైన తర్వాత జూన్‌లో రెండు సార్లు, జూలైలో నాలుగు సార్లు మాత్రమే గ్రేటర్‌లో భారీ వర్షాలు నమోదయ్యాయి. రెండు వారాలుగా రెండు, మూడు సార్లు తేలికపాటి జల్లులు మినహా.. ఎక్కడా భారీ వర్షాలు లేవు. దీంతో నగరంలో పొడి వాతావరణం ఏర్పడి వేడి పెరిగింది. శనివారం రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. మరో మూడు రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా మోస్తరు నుంచి అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశముంటుందని బేగంపేట వాతావరణశాఖ అధికారులు తెలిపారు.

ఈ క్రమంలోనే నగర వాసులకు బల్దియా టోల్‌ ‌ఫ్రీ నంబర్లను ఏర్పాటు చేసింది. నగరవాసుల సమస్యల పరిష్కారం కోసం టోల్‌ ‌ఫ్రీ నంబర్లు 040- 21111111, 9000113667ను ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే డిజాస్టర్‌ ‌బృందాలు అప్రమత్తంగా ఉండాలంటూ అడిషనల్‌ ‌కమిషనర్‌ ‌ప్రకాష్‌ ‌రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. వర్షం నేపథ్యంలో జీహెచ్‌ఎం‌సీ కంట్రోల్‌ ‌రూమ్‌కు పలు అంశాలపై ఫిర్యాదులు వొచ్చాయి. ఖైరతాబాద్‌లో పాత గోడ కూలగా.. ఎవరికి ఎలాంటి ప్రమాదం జరుగలేదు. 35 ఫిర్యాదులు రాగా.. 34 పరిష్కరించినట్టు ఈవీడీఎం డైరెక్టర్‌ ‌ప్రకాష్‌ ‌రెడ్డి తెలిపారు. ఇక ఉమ్మడి నిజామాబాద్‌ ‌జిల్లా వ్యాప్తంగా సోమవారం తెల్లవారుజామున 3 గంటల నుంచి ఎడతెరపి లేకుండా వర్షం వొస్తున్నది. ఇందల్వాయి, డిచ్‌పల్లి, ధర్పల్లి, సిరికొండ, జక్రాన్‌పల్లిలో వాన దంచికొడు తున్నది. అత్యధికంగా డిచ్‌పల్లి మండలం గన్నారంలో 14 సెంటీవి•టర్ల వర్షం పడింది. గాంధారి, సిరికొండ మండలంలోని చీమనుపల్లిలో 12 సెం.వి•, సదాశివనగర్‌ ‌జుక్కల్‌, ‌జక్రాన్‌పల్లిలో 11 సెం.వి•, డిచ్‌పల్లి, మదన్‌పల్లిలో 10 సెంటీవి•టర్ల వర్షపాతం నమోదయింది. శ్రీరాంసాగర్‌కు మరోమారు వరద పోటెత్తింది. ఇక భూపాలపల్లి జిల్లాలో ఆదివారం నుంచి ఎడతెరపిలేకుండా వర్షం కురుస్తున్నది. దీంతో సింగరేణి ఓపెన్‌కాస్ట్ 2, 3 ‌గనుల్లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. కాగా, నిజామాబాద్‌ ‌జిల్లాలో భారీ వర్షాలు కురుస్తుండటంతో ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్‌ ‌పాఠశాలలకు జిల్లా విద్యాధికారి దుర్గాప్రసాద్‌ ‌నేడు సెలవు ప్రకటించారు.

భారీ వానలతో పలుచోట్ల రాకపోకలకు ఇబ్బందులు తలెత్తిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. ఉమ్మడి మెదక్‌ ‌జిల్లాలో భారీ వర్షం కురుస్తున్నది. సంగారెడ్డి జిల్లా కంగ్టిలో అత్యధికంగా 13 సెంటీవి•టర్ల వర్షపాతం నమోదయింది. మెదక్‌ ‌జిల్లా కౌడిపల్లిలో 8.3 సెంటీవి•టర్ల వర్షం కురిసింది. బంగాళాఖాతంలో ఆదివారం ఏర్పడిన ఆవర్తన ప్రభావంతో వచ్చే 48 గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశాలున్నాయని వాతావరణశాఖ తెలిపింది. అల్పపీడన ప్రభావంతో వొచ్చే మూడు రోజులపాటు పలు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు వర్షాలు కురిసే సూచనలున్నాయని హైదాబాద్‌ ‌వాతావరణశాఖ తెలిపింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఆరెంజ్‌, ఎల్లో అలర్ట్‌ను జారీ చేసింది.

ఉమ్మడి నిజామాబాద్‌లో భారీ వర్షాలు….శ్రీరాం సాగర్‌కు పోటెత్తిన వరద
ఎగువన కురుస్తున్న వర్షాలకు నిజాంసాగర్‌ ‌ప్రాజెక్టులోకి వరద నీరు భారీగా వచ్చి చేరుతోంది. సోమవారం ప్రాజెక్టులోకి 2,500 వేల క్యూసెక్కుల వరద ప్రవాహం వచ్చినట్లు అధికారులు తెలిపారు. నిజాం సాగర్‌ ‌జలాశయం పూర్తిస్తాయి నీటిమట్టం 1405 అడుగుల కాగా, ప్రస్తుత నీటిమట్టం 1403.7 అడుగులు ఉంది.ఇక, నిజాంసాగర్‌ ‌ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం 17.802 టీఎంసీలు కాగా, ప్రస్తుతం నీటినిల్వ సామర్థ్యం 16 టీఎంసీలు ఉంది.నిజామాబాద్‌ ‌జిల్లాలో ఎడతెరపి లేకుండా వాన పడుతున్నది. మోపాల్‌ ‌మండలంలో 15.7 సెంటీవి•టర్ల వర్షపాతం నమోదయింది. ఇందల్వాయిలో 14.8, డిచ్‌పల్లిలో 14.2, జక్రాన్‌పల్లి 13.8, సిరికొండలో 13.5 సెంటీవి•టర్ల వర్షం కురిసింది. భారీ వర్షాల దృష్ట్యా జిల్లాలోని విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించారు. జుక్కల్‌-‌బస్వపూర్‌ ‌మధ్యలో వంతెన పనులు నిలిచిపోయాయి. ప్రత్యామ్నాయ రోడ్డు కోతకు గురవడంతో వాహనాల రాకపోకలు నిలిచాయి. ఇక సిరికొండ మండలంలో కప్పల వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నది. గడ్కోల్‌ ‌వద్ద లోలెవల్‌ ‌బ్రిడ్జ్‌పై వాహనాలను అధికారులు నిలిపివేశారు. కామారెడ్డి జిల్లా రాజాంపేట, బీబీపేట, మండలాల్లో భారీ వర్షం కురుస్తున్నది. మాచారెడ్డి, బిక్కనూర్‌, ‌దోమకొండ మండలాల్లో కుండపోతగా వానపడింది. భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. గాంధారి మండలంలో 14.4 సెంటీవి•టర్ల వర్షపాతం నమోదయింది. సదాశివనగర్‌లో 12, జుక్కల్‌లో 11.7 సెంటీవి•టర్ల వర్షం కురిసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *