ఆమనగల్లు, ప్రజాతంత్ర అక్టోబర్ 27 : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 5 వందల జనాభా గల తండాలు గూడాలను మాతాండాలలో మా రాజ్యం అనే నినాదంతో గిరిజన తాండాలను గ్రామపంచాయతీలుగా మార్చిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ కే దక్కిందన్నారు. కడ్తాల్ మండలంలోని మైసిగండి, గ్రామ పంచాయితీల 163వ బూత్ కమిటీ, 164వ బూత్ కమిటీ లను కడ్తాల్ మండల జడ్పిటిసి సమక్షంలో మైసిగండి గ్రామ సర్పంచ్ తులసిరాం నాయక్ ఆధ్వర్యంలో ఎన్నుకున్నారు. అదేవిధంగా కమిటీలో ఎన్నికైన వారికి నియామక పత్రాన్ని జడ్పిటిసి స్థానిక నాయకులతో కలిసి అందజేశారు. జెడ్పిటిసి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో మన ప్రభుత్వం సంబండ వర్గాలకు న్యాయం చేసే విధంగా అనేక సంక్షేమ పథకాలను తీసుకురావడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో పిఎసిఎస్ చైర్మన్ గంప వెంకటేష్ గుప్తా, వైస్ ఎంపీపీ బావండ్లపల్లి ఆనంద్, ఎంపీటీసీ లచ్చి రామ్ నాయక్, మండల రైతు కోఆర్డినేటర్ జోగు వీరయ్య, మాజీ ఎంపీపీ హర్యానాయక్, మాజీ ఎంపిటిసి సక్రి, కడ్తాల్ గ్రామ రైతు కోఆర్డినేటర్ నరసింహ, ఉప సర్పంచ్ లు రాజారామ్ , రమణ, మైసిగండి గ్రామ బి ఆర్ ఎస్ పార్టీ అధ్యక్షులు మూడవత్ రవి, గ్రామపంచాయతీ వార్డ్ మెంబర్లు రాజేష్ గౌడ్, రామావత్ పత్యా నాయక్, శంకర్, గ్రామ సీనియర్ నాయకులు రామవత్ పంత్యా, సబావత్ సొమ్ల, చిన్నవత్ శంకర్, కొర్ర మూర, గోపాల్, రామస్వామి గౌడ్, శ్రీరాములు గౌడ్, శంకర్, లక్ష్మీనారాయణ గౌడ్, మండల నాయకులు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.
రాష్ట్రంలో తాండాలను గ్రామపంచాయతీలు గా మార్చిన ఘనత కేసీఆర్ దే



