రాష్ట్రంలో టెన్త్ ‌పరీక్షలు ప్రారంభం

పరీక్షా కేంద్రాలవద్ద కోలాహలం
హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 3 : ‌రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు సోమవారం ఉదయం ప్రారంభమయ్యాయి. ఉదయం 9:30 గంటల నుంచి 12:30 గంటల వరకు పరీక్ష జరుగనుంది. ఆరు పేపర్లతోనే టెన్త్ ‌పరీక్షలను ఎస్‌ఎస్‌స్సీ బోర్డు నిర్వహించనుంది. ఏప్రిల్‌ 3 ‌నుండి 13 వరకు పరీక్షలు జరుగనున్నాయి. ఇక పరీక్షలకు ఐదు నిమిషాలు ఆలస్యమైనా అనుమతిస్తామని విద్యా శాఖ ప్రకటించింది. ఉదయం 9:35 గంటల వరకు విద్యార్థులను అధికారులు పరీక్షా కేంద్రంలోకి అనమతించారు.

పదో తరగతి పరీక్షల కోసం మొత్తం 2652 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. 4.94 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. మొత్తం విద్యార్థుల్లో అబ్బాయిలు 2,43,852, అమ్మాయిలు 2,41,974 ఉన్నారు. అలాగే 3,78,794 మంది విద్యార్థులు ఇంగ్లీష్‌ ‌వి•డియంలో పరీక్ష రాయనుండగా.. 98,726 మంది విద్యార్థులు తెలుగు వి•డియంలో పరీక్ష రాయనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *