రాష్ట్రంలో జాకీ పెట్టుబడులు 7వేల మందికి ఉపాధి దక్కుతుందంటూ కెటిఆర్‌ ‌ట్వీట్‌

తెలంగాణ రాష్టాన్రికి పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతూనే ఉంది. తాజాగా జాకీ గార్మెంట్‌ ‌ఫ్యాక్టరీ కూడా తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతోంది. ఈ మేరకు జాకీ కంపెనీ ప్రతినిధులు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌తో సమావేశమయ్యారు. తెలంగాణలో పెట్టుబడులు పెడుతున్నట్లు కేటీఆర్‌కు వారు వివరించారు. సందర్భంగా కేటీఆర్‌ ‌ట్వీట్‌ ‌చేశారు. జనాల్లో పాపులారిటీ సంపాదించుకున్న ఇన్నర్‌ ‌వేర్‌ ‌బ్రాండ్‌ ‌జాకీ ఇబ్రహీంపట్నం, ములుగులో గార్మెంట్‌ ‌మ్యానుఫ్యాక్చరింగ్‌ ‌ఫ్యాక్టరీలను ఏర్పాటు చేయబోతుందని కేటీఆర్‌ ‌తెలిపారు. ఒక కోటి బట్టలను ఉత్పత్తి చేయడమే లక్ష్యంగా ఈ ఫ్యాక్టరీని నెలకొల్పనున్నారు. దీంతో 7 వేల మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. ఈ సందర్భంగా జాకీ కంపెనీని హృదయపూర్వకంగా స్వాగతిస్తూ, శుభాకాంక్షలు తెలుపుతున్నట్లు కేటీఆర్‌ ‌తన ట్వీట్‌లో పేర్కొన్నారు.

కేటీఆర్‌ ‌తో జర్మన్‌ ‌కాన్సుల్‌ ‌జనరల్‌ ‌భేటీ
చెన్నైలో ఉన్న జర్మనీ కాన్సులేట్‌లోని కౌన్సుల్‌ ‌జనరల్‌ ‌మైఖేల్‌ ‌కుచ్లర్‌ ‌బుధవారం హైదరాబాద్‌లో పర్యటించారు. తెలంగాణ ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌తో ఆమె భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆ ఇద్దరూ చర్చించుకున్నారు. హైదరాబాద్‌కు తొలి సారి విజిట్‌ ‌చేసిన కౌన్సుల్‌ ‌జనరల్‌ ‌మైఖేల్‌ ‌కుచ్లర్‌కు మంత్రి కేటీఆర్‌ ‌స్వాగతం పలికారు. తెలంగాణ, జర్మనీ మధ్య ప్రాధాన్యత రంగాల సహకారం గురించి ఇద్దరూ చర్చించుకున్నట్లు మంత్రి కేటీఆర్‌ ‌తన ట్వీట్‌లో తెలిపారు. ఆవిష్కరణలు, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు, స్కిల్‌ ‌డెవలప్మెంట్‌ అం‌శాలపై జర్మనీ కౌన్సుల్‌ ‌జనరల్‌తో మంత్రి కేటీఆర్‌ ‌ముచ్చటించారు. తెలంగాణలో జర్మనీ కంపెనీలకు అద్భుతమైన అవకాశాలు ఉన్నట్లు కౌన్సుల్‌ ‌జనరల్‌ ‌మైఖేల్‌ ‌తెలిపారు. చెన్నై కౌన్సులేట్‌ ‌తన ట్విట్టర్‌లో ఈ విషయాన్ని వెల్లడించింది. దేశంలో అత్యంత నైపుణ్యం కలిగి ఉన్న కార్మికుల్లో తెలంగాణ అయిదో రాష్ట్రంగా నిలుస్తుందని కౌన్సుల్‌ ‌జనరల్‌ ‌కీర్తించారు. లైఫ్‌ ‌సైన్సెస్‌తో పాటు వ్యాక్సిన్‌ ఉత్పత్తిలో తెలంగాణ రాష్ట్రం ప్రత్యేకత సంతరించుకున్నట్లు జర్మనీ కౌన్సులేట్‌ ‌పేర్కొన్నది. మంత్రి కేటీఆర్‌తో జరిగిన చర్చలు ఫలప్రదం అయినట్లు జర్మనీ కౌన్సుల్‌ ‌జనరల్‌ ‌తన ట్వీట్‌లో వెల్లడించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *