రాష్ట్రంలో ఎవ్వరూ నిరసన తెలిపే పరిస్థితి లేదు

  • పోరాటాలను అణిచి వేసే ప్రయత్నం
  • ఒంటెద్దు పోకడలకు కాలం చెల్లింది
  • 24 గంటల దీక్షను విరమించిన రాష్ట్ర బిజెపి చీఫ్‌, ‌కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 14 : ‌బిజెపి పోరాటాలను అణిచి వేసేందుకు కేసీఆర్‌ ‌ప్రయత్నం చేస్తున్నారని తెలంగాణ బీజేపీ చీఫ్‌, ‌కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఆరోపించారు. గురువారం బీజేపీ కార్యాలయంలో 24 గంటల ఉపవాస దీక్షను విరమించిన అనంతరం కిషన్‌ ‌రెడ్డి వి•డియాతో మాట్లాడుతూ… పోరాటం చేసి తెచ్చుకున్న తెలంగాణలో ఏ ఒక్క వర్గానికి నిరసన తెలియజేసే పరిస్థితి లేదన్నారు. ముఖ్యమంత్రి రాజ్యాంగం ఇచ్చిన హక్కులను కాలరాస్తున్నారని మండిపడ్డారు. బయట ఉద్యమాలు చేయవద్దు, అసెంబ్లీలో మాట్లాడవద్దు అన్నట్లు కేసీఆర్‌ ‌వ్యవహరిస్తున్నారన్నారు. శాంతియుతంగా నిరసన చేస్తుంటే బీజేపీ కార్యకర్తలపై విపరీతంగా దాడులు చేశారని..ఈ దాడులలో అనేక మంది కార్యకర్తలకు గాయాలయ్యాయన్నారు. కెసిఆర్‌ ‌తెలంగాణ యువతకు ఇచ్చిన హావి•లను నెరవేర్చని తాము కోరామని, తెలంగాణ వొస్తే తన తమ్ముళ్లకు, అన్నలకు, అక్కలకు, చెల్లెళ్లకు ఉద్యోగాలు వొస్తాయని లేఖలు రాసి ఆత్మహత్య చేసుకున్నారని అన్నారు.

కారుకూతలు కూసే కేసీఆర్‌ ‌కుటుంబం, బీఆర్‌ఎస్‌ ‌నేతలు హావి•లను నెరవేర్చలేదని, ఉద్యోగం రాదన్న బాధతో మరోమారు యువత ఆత్మహత్యలు చేసుకుంటున్నారని మండిపడ్డారు. తెలంగాణ ఉద్యమంలో కూడా ఈ స్థాయిలో అప్పటి ప్రభుత్వం ఇంత దుర్మార్గంగా వ్యవహరించలేదన్నారు. నేడు పోలీసులు వ్యవహరించిన తీరుగా ఉద్యమంలో పోలీసులు వ్యవహరించి ఉంటే కెసిఆర్‌ ‌కొడుకు, కూతురు అమెరికా పారిపోయే వారని అన్నారు. కేసీఆర్‌ ఏనాడూ సకల జనుల సమ్మె, సాగర హారంలో పాల్గొన లేదని తెలిపారు. ఉద్యమ పోరాటం నుంచి పారిపోయిన వ్యక్తి వి• అయ్య అంటూ కెటిఆర్‌ను ఉద్దేశించి అన్నారు. తమకు ఎవరీ సర్టిఫికెట్‌ అవసరం లేదని, ప్రజల ఆశీస్సులు తమపై ఉన్నాయన్నారు. తెలంగాణ రాకముందు మనను కాంగ్రెస్‌ ‌పార్టీ దోచుకుందని, ఉద్యమకారులను కాల్చి చంపిందని, కాంగ్రెస్‌ ‌హయాంలో పోలీసులు కాల్పులు తెలంగాణ ప్రజలు మరువకూడదన్నారు కిషన్‌ ‌రెడ్డి. తెలంగాణ సమాజంపై కాంగ్రెస్‌ ‌పార్టీ ఎంత దుర్మార్గంగా వ్యవహరించిందో ప్రజలు గుర్తుంచుకోవాలని, ఎన్నికల్లో చిన్న పొరపాటు జరిగినా ప్రజాస్వామ్యం మరచిపోయి నిజాం పాలన చూడాల్సి వొస్తుందన్నారు.

తెలంగాణ సమాజమా మేలుకో..అర్థం చేసుకోండని రాష్ట్ర ప్రజలకు కిషన్‌ ‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. సోనియా గాంధీ, కేసీఆర్‌ ‌కుటుంబాలు అత్యంత సన్నిహితమైన కుటుంబాలేనని, కాంగ్రెస్‌ను సమర్థిస్తే బీఆర్‌ఎస్‌ను సమర్థించినట్టేనని, బీఆర్‌ఎస్‌ను సమర్థిస్తే కాంగ్రెస్‌ను సమర్థించినట్టేనని, ఈ రెండు పార్టీలు తెలంగాణా ప్రజల పాలిట శాపంగా మారుతాయని కిషన్‌ ‌రెడ్డి విమర్శించారు. ఈ రెండు పార్టీలకు గురువు అసదుద్దీన్‌ ఓవైసీ అని, ఆయన ఏది రాసిస్తే వాళ్ళు అదే మాట్లాడుతారని విమర్శించారు. కెసిఆర్‌ ‌కుటుంబం నుంచి తాము పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం లేదని, కల్వకుంట్ల కుటుంబం, ఎంఐఎం కోసం బీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం పని చేస్తుందని ఆరోపించారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వొస్తే అన్ని ఖాళీలను భర్తీ చేస్తుందని, ఎలాంటి పొరపాట్లు లేకుండా యూపీఎస్సీ తరహాలో టీఎస్పీఎస్సీ ద్వారా ఉద్యోగాలు ఇస్తామని, నిరుద్యోగుల ఆకాంక్షలు నెరవేరుస్తామని కిషన్‌ ‌రెడ్డి నిరుద్యోగులకు హామీ ఇచ్చారు. ముద్రా రుణాల ద్వారా యువతను ఉద్యోగాలు ఇచ్చేలా తీర్చి దిద్దుతామని అన్నారు. బుధవారం ఇందిరా పార్క్‌లో బీజేపీ కార్యకర్తలు పోలీసులకు చెమటలు పట్టించి, కేసీఆర్‌ ‌గుండెల్లో గుబులు రేపేలా చేసారని, వారికి సెల్యూట్‌ ‌చేస్తున్నానంటూ కిషన్‌ ‌రెడ్డి పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *