ఉప్పల్, ప్రజాతంత్ర, జూలై 15 : బడుగు బలహీన వర్గాలకు చేయూతనందించేందుకు ప్రజలకు న్యాయంగా రావలసిన అన్ని సదుపాయాలను అందించాలని ధ్రుడ సంకల్పంతో ద్రావిడ దేశం కృషి చేస్తుందని ద్రావిడ దేశం అధ్యక్షులు వంటెరు కృష్ణారావు తెలిపారు. దీనిలో భాగంగా రాష్ట్రం లొ ద్రావిడ దేశం తెలంగాణ రాష్ట్రవిభాగాన్ని త్వరలోప్రారంభించనున్నట్టు తెలిపారు. దీంతో పాటు దక్షిణ భారత దేశం లోని అన్ని రాష్ట్రాలలోను తమశాఖలనువిస్తరించనున్నట్టు తెలిపారు. ఈ సందర్భంగాహైదరాబాదులో మాజీ జాతీయ బీసీ కమిషన్ చైర్మన్ జస్టిస్ ఈశ్వరయ్య, తమిళనాడు డీఎంకే ఎంపీ పీ.విల్సన్, బీహార్ మాజీముఖ్యమంత్రి బీపీ మండల్ మనవడు ప్రొఫెసర్ సూరజ్ మండల్, శ్రీనివాస యాదవ్ గార్లతో కలిసి దక్షిణ భారతదేశంలో ఎస్సీ ,ఎస్టీ బీసీ, మైనారిటీ వర్గాల ప్రజల హక్కుల కొరకు చేయవలసిన ప్రణాళికల గురించి విపులంగా చర్చించడం జరిగిందని వివరించారు. రాష్ట్రంలోని అన్నిజిల్లాలలో ద్రావిడ దేశం యొక్క శాఖలలో అన్ని వర్గాల వారిని భాగస్వామ్యం ప్రజాసేవ చేయడానికి జస్టిస్ ఈశ్వరయ్య ను కోరగావారుసానుకూలంగా స్పందించారని తెలిపారు.




