రామాలయం చుట్టూ ఉన్న రోడ్లను ముంచి వేసిన వర్షం నీరు – ఇబ్బందులు పడుతున్న భక్తులు

రామాలయం వద్ద ఉన్న అన్నదానం సత్రం నీరు చేరుకున్న దృశ్యం. రామాలయం చుట్టూ ఉన్న రోడ్లు వర్షం నీటితో ఉన్న దృశ్యం.

రామాలయం చుట్టూ ఉన్న రోడ్లను ముంచి వేసిన వర్షం నీరు – ఇబ్బందులు పడుతున్న భక్తులు. భద్రాచలం,

ప్రజాతంత్ర జూలై 20: అల్పపీడనం కారణంగా కురుస్తున్న భారీ వర్షాలకు భద్రాచలం లోతట్టుప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లపైకి నీరు భారీగా చేరుకుంది. మరి ముఖ్యంగా భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయం చుట్టూ వర్షం నీరు చేరుకుంది. రామాలయం దగ్గర ఉన్న విస్తా కాంప్లెక్స్ ప్రాంతానికి భారీగా నీరు చేరుకుంది. నిత్య అన్నదాన సత్రం వద్ద కూడా నీరు చేరింది దీని కారణంగా భక్తులకు తీవ్ర ఇబ్బంది ఏర్పడింది. యాత్రికుల వాహనాలు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. విశ్వ కాంప్లెక్స్ దగ్గర ఉన్న స్లోయిస్ పనిచేయకపోవడం. ఆలయం చుట్టూ ఉన్న నీటిని గోదావరిలోకి పంపించేందుకు ఏర్పాటుచేసిన మోటర్లు సరిగా పని చేయకపోవడం వలన రామాలయం చుట్టూ నీరు ఇంకా పెరుగుతుంది. భద్రాచల పట్టణంలో డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేకపోవడం వలన లోతట్టు ప్రాంతాలు ఇండ్లలోకి వరద నీరు చేరుకుంది. రాజుపేట వద్ద వరుసపనీరు రోడ్లపైకి రావడంతో రాకపోకలకు తీవ్రతరాయం ఏర్పడింది. ఇప్పటికే గోదావరి నలభై అడుగులు దాటి ప్రవహిస్తుంది. 43 అడుగులకు చేరుకోగానే అధికారులు మొదట హెచ్చరికలు జారీ చేస్తారు ఎగువ ప్రాంతంలో వరద నీరు ఎక్కువగా ఉండటం వలన భద్రాచలం వద్ద గోదావరి పెరిగే అవకాశం ఉందని జిల్లా కలెక్టర్ ప్రియాంకల హెచ్చరించారు. అధికారులందరూ అప్రమత్తంగా ఉండి ఎప్పటికప్పుడు సమాచారాన్ని ప్రజలకు అందించాలని సూచన చేశారు అంతేకాకుండా వరద పెరిగే అవకాశం ఉన్నందున అధికారులు అప్రమత్తంగా ఉండి లోతట్టు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశాలు జారీ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *