రామంతాపూర్  డివిజన్ సమస్యలపై విస్తృత పర్యటన బిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్ది బండారి లక్ష్మా రెడ్డి  

 ఉప్పల్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 11:  రామంతాపూర్ డివిజన్ లోని సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఉప్పల్ నియోజకవర్గ   బిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి స్పష్టం చేశారు. సోమవారం  బండారి లక్ష్మారెడ్డి,  ఉప్పల్ బిఆర్ఎస్ సీనియర్  నాయకులు గంథం నాగేశ్వరావు తో కలిసి రామంతపూర్  శ్రీరామ కాలనీలోనిమహంకాళి అమ్మవారి కి  ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయనకాలనీ వాసులతో మాట్లాడి ప్రధాన సమస్యలను అడిగి తెలుసుకున్నారు.  కాలనీ కి సంబందించి ఎటువంటి సమస్యలైన తమ దృష్టికి తిసుకువస్తే తప్పకుండ తమవంతు సహయ సహకారాలు అందించి పరిష్కారానికి  కృషి చేస్తానన్నారు.జనప్రియ,శాంతి నగర్ కాలని, అపార్ట్మెంట్ వాసులతో కలిసి వారి సమస్యలను అడిగితెలుసుకున్నారు. పబ్లిక్ స్కూల్ గల్లి ముత్యాలమ్మ టెంపుల్ పునర్నిర్మాణ  కార్యక్రమం లో పాల్గోన్నారు.ఈ కార్యక్రమం లో మధుసూదన్ రెడ్డి,ఆలే రమేష్,చంబు సాయి,తుట్ నరసింహ,వెంపటి శ్రీను,సాగర్,మహేందర్,రాజు యాదవ్,సాలార్, సురం శంకర్ ,ప్రశాంత్ గౌడ్,బోసాని పవన్,నరేష్,జహంగీర్,చాంద్ పాషా,ఆనంద్ తదితరులు  పాల్గోన్నారు .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *