సిద్దిపేట, ప్రజాతంత్ర, డిసెంబర్ 14:బహుజన్ సమాజ్ పార్టీ సిద్దిపేట నియోజకవర్గ కమిటీ ఆధ్వర్యంలో జిల్లా పార్టీ కార్యాలయంలో పుల్లూరు ఉమేశ్ అధ్యక్షతన సమీక్షా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు లింగంపల్లి యాదగిరి, విశిష్ట అతిథిగా సిద్దిపేట అసెంబ్లీ ఇంచార్జ్ బక్రీచెప్పాలా అశోక్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రానున్న స్థానిక సంస్థల ఎలక్షన్లలో సిద్దిపేట నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో బిఎస్పి పార్టీ గెలుపే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని ఈ సందర్భంగా వారు తెలియజేశారు. మొన్న జరిగిన సాధారణ ఎలక్షన్లలో టిఆర్ఎస్ ప్రజలు ఏరకంగా బుద్ధి చెప్పారని అందరూ చూసిన విషయమే గెలుకూటములు రాజకీయాల్లో సహజం బహుజన్ సమాజ్ పార్టీ ప్రజలకు ఎక్కడ అన్యాయం జరిగిన సహించేది లేదు అని సందర్భంగా వారు మాట్లాడారు. పార్టీ కి వ్యతిరేకంగా ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసిన ఏటి ఆంజనేయులు పార్టీ నుండి సస్పెండ్ చేస్తూ అసెంబ్లీ కమిటీ నాయకులు మండల అధ్యక్షులు అందరూ తీర్మానం చేయడం జరిగింది. పార్టీ వ్యతిరేకంగా ఎవ్వరూ పాల్పడిన వారి పైన క్రమశిక్షణ చర్యలు తీసుకోవడం జరుగుతుంది అని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో అసెంబ్లీ కోశాధికారి పొన్నాల నర్సింలు, అసెంబ్లీ కార్యదర్శి రంగదాం బాను, నంగునూరు మండల అధ్యక్షుడు ఖాతా మహేష్, సిద్దిపేట రూరల్ మండల అధ్యక్షుడు కర్రె హరికిరణ్, చిన్నకోడూరు మండల అధ్యక్షుడు కొమ్ము ప్రశాంత్, నారాయణరావుపేట మండల అధ్యక్షుడు బండారి శంకర్, సిద్దిపేట అర్బన్ మండల ప్రధాన కార్యదర్శి ఐరన్ లింగం, బిఎస్పీ నాయకులు, ప్రసాద్, సంపత్, బబుమియ, భాస్కర్, హరీష్, స్థానిక నాయకులు పాల్గొన్నారు.
రాబోయే స్థానిక సంస్థల ఎలక్షన్ లో గెలుపే లక్ష్యం బీఎస్పీ





