రాబోయే రోజుల్లో  అధికారం మనదే

షాద్ నగర్ ప్రజా తంత్ర అక్టోబర్ 31:  సoగెం నాయకులు భూపాల్ రెడ్డి ఆధ్వర్యంలో టిఆర్ఎస్ పార్టీకి చెందిన నాయకులు కార్యకర్తలు 100 మంది  కాంగ్రెస్ పార్టీలో చేరిక మరో 30 రోజుల(720 గంటల లో ) తరువాత కాంగ్రెస్ పార్టీకి అధికారం రాబోతుందని, షాద్ నగర్ నియోజక వర్గంలో గణనీయమైన మార్పులు సంభవించబోతున్నాయని షాద్ నగర్ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్ రెడ్డి అన్నారు. మంగళవారం షాద్ నగర్ పట్టణంలో చౌలపల్లి ప్రతాపరెడ్డి కార్యాలయంలో మాజీ శాసనసభ్యులు చౌలపల్లి ప్రతాపరెడ్డి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వీర్లపల్లి శంకర్ మాజీ జడ్పిటిసి సభ్యులు మామిడి శ్యాంసుందర్ రెడ్డి సoగెం నాయకులు భూపాల్ రెడ్డి ఆధ్వర్యంలో టిఆర్ఎస్ పార్టీకి చెందిన నాయకులు కార్యకర్తలు 100 మంది  కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే  చౌలపల్లి ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ బెదిరింపులతో తెరాస పార్టీలో చేర్చుకొని చేరిన తర్వాత మండల అభివృద్ధిని ఏ మాత్రం పట్టిచించుకోకుండా సొంత ప్రయోజనాలే చూసుకున్న తెరాస ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ ని మరోసారి నమ్మడానికి షాద్ నగర్ ప్రజలు సిద్ధంగా లేరని ఆయన ఓటమి ఇప్పటికే ఖాయం అయిందని అందుకే పాత కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరడానికి ముందుకు వస్తున్నారనీ అన్నారు. రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమే కాబట్టి ఎవరు అదైర్య పడోద్దు మళ్ళీ ఇందిరమ్మ రాజ్యం వస్తుందనీ అందరికీ సంక్షేమ ఫలాలు అందుతాయని ఇండ్లు లేని వరకు ఆనాడే ఎన్ని ఇందిరమ్మ ఇండ్లు కట్టించమని, రైతులకు పేదలకు, యువతకు అన్ని వర్గాల ప్రజల సంక్షేమం ఒక్క కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం అవుతుందని రాబోయే 30రోజుకు కలిసి కట్టుగా కష్టపడితే కాంగ్రెస్స్ అధికారం లోకి వస్తుంది.కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వీర్లపల్లి శంకర్ హస్తం గుర్తు కు ఓటు వేసి గెలిపించాలని కోరారు, ఈ కార్యక్రమంలో జృమద్ ఖాన్, దంగు శ్రీనివాస్ యాదవ్, ఆంజనేయలు గౌడ్, యాదగిరి గౌడ్, చంద్రమౌళి, ఇబ్రహీం, నవీన్ తదితరులు హాజరుయ్యారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *