సిద్దిపేట, ప్రజాతంత్ర, అక్టోబర్ 21: రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో కాషాయ జెండా ఎగరడం ఖాయమని బీజేపీ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు దూది శ్రీకాంత్ రెడ్డి పేర్కొన్నారు.శనివారం నారాయణరావుపేట్ మండలంలోని బుగ్గ రామేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం మాటిండ్ల గ్రామంలో శ్రీకాంత్ రెడ్డి ఇంటింటి ప్రచారం నిర్వహించారు.మాటిండ్ల గ్రామానికి చెందిన 50 మంది యువకులు పార్టీలో చేరగా వారికి కండువాలు కప్పి ఆహ్వానించారు.ఈ సందర్భంగా శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ ఈసారి సిద్దిపేట తో పాటు రాష్ట్రంలో జరిగే ఎన్నికల్లో బిజెపి సత్తా చాటుతుందని ధీమా వ్యక్తం చేశారు.అమృత పథకంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులతోనే సిద్దిపేటలో అభివృద్ధి జరిగిందన్నారు. తెలంగాణకు సహకరించడం లేదని కేంద్ర ప్రభుత్వంపై బిఆర్ఎస్ నాయకులు చేస్తున్న విమర్శలు అర్ధరహితమన్నారు.సిద్దిపేటకు రైలు ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం కాదా అని ప్రశ్నించారు.ప్రధానమంత్రి మోదీ తెలంగాణకు వస్తుండంటే చాలు సీఎం కేసీఆర్కు భయం పట్టుకుంటుందన్నారు.ప్రధాని వచ్చిన ప్రతిసారి ముఖం చాటేస్తారంటూ కేసీఆర్ను విమర్శించారు.కాంగ్రెస్ గ్యారంటి లేని పార్టీ అంటూ ఎద్దేవా చేశారు. రాష్ట్ర మంత్రి కేటీఆర్కు ప్రధాన మంత్రిని విమర్శించే స్థాయి లేదన్నారు.కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్రెడ్డి, బీఆర్ఎస్ మంత్రి కేటీఆర్ ఇద్దరూ ఒకే రకమైన విమర్శలు చేస్తున్నారని, వారిద్దరూ ఒకటేనని పేర్నొన్నారు.తెలంగాణ అభివృద్ధికి బీజేపీ కంకణం కట్టుకుందన్నారు.కేంద్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధే తెలంగాణలో బీజేపీని గెలిపిస్తుందని శ్రీకాంత్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు బుగ్గ రాజేశం, జిల్లా అధికార ప్రతినిధి రమేష్ గౌడ్, బాపు రెడ్డి, దేవరాజు గ్రామస్థులు బాబు, కొంగరి రాజనర్సు , మల్కి ధర్మపురి, మళ్ళి స్వామి, నీరటి నగేష్, రుద్రారపు స్వామి, బోయిని రాజు, తదితరులు పాల్గొన్నారు.
రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో కాషాయ జెండా ఎగరడం ఖాయం





