రానున్న ఎన్నికల్లో బిజెపి విజయం ఖాయం

వికారాబాద్ జిల్లా, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 11: రాష్ట్రంలో ప్రజలు బీజేపీ పార్టీని కోరుకుంటున్నారని కచ్చితంగా రాష్ట్రంలో అధికారంలోకి వస్తామని బీజేపీ చేవెళ్ల పార్లమెంట్ ఇన్ చార్జి బి. జనార్థన్ రెడ్డి అన్నారు. సోమవారం అనంతపద్మనాభ స్వామిని స్థానిక నాయకులతో కలిసి  దర్శించుకున్నారు. అనంతరం విలేకరుల సమావేశం నిర్వహించిన ఆయన మాట్లాడుతూ. రాష్ట్రంలో బీఆర్ఎస్ , ఎంఐఎం పార్టీలు ఒక్కటని పేర్కొన్నారు. మజ్లీస్ తో జత కట్టే బీఆర్ఎస్ బేజేపీ దోస్తి అనేది అవాస్తవమని రాష్ట్రంలో బీఆర్ఎస్ గట్టి పోటీ బీజేపీనేనని స్పష్టం చేశారు. చేవెళ్ల పార్లమెంట్  టిక్కెట్ ఎవరికి ఇచ్చిన పార్టీ గెలుపు కోసం పని చేస్తామన్నారు. బీజేపీ పార్టీ 2019 ఎన్నికల తరువాత రాష్ట్రంలో పుంజుకుందని ఆ తరువాత జరిగిన ఉప ఎన్నికల్లో సైతం సత్తా చాటిందన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో 20% శాతం ఓటు బ్యాంకు పెరిగిందని గుర్తు చేశారు. వచ్చే ఎన్నికల్లో చేవెళ్ల పార్లమెంట్ పరిధిలోని మేజార్టీ  అసెంబ్లీ స్థానాలతో పాటు పాటు పార్లమెంట్ స్థానం బీజేపీ కైవసం చేసుకుంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శివరాజు, మాధవరెడ్డి, నాయకులు కేపీ రాజు, పోకల సతీష్ రాములు , విజయ్ భాస్కర్ రెడ్డి, బొత్స శ్రీకాంత్ ,  వికానందారెడ్డి, అనిల్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *