వికారాబాద్ జిల్లా, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 25 : వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గం నుంచి త్వరలో జరగబోయే ఎమ్మెల్యే ఎన్నికల్లో స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీలో నేనుంటానని బీసీ సంఘం నాయకులు కుమ్మరిపల్లి లాలయ్య తెలిపారు. 2018 ఎమ్మెల్యే నామినేషన్ లో మన పార్టీ నుంచి బరిలో నిలిచేందుకు దరఖాస్తు చేయడానికి వెళ్లినానని కొద్ది క్షణాల్లో సమయం ఆలస్యమైనందున కొద్ది క్షణాల్లో నామినేషన్ దాఖలు చేయలేకపోయానని లాలయ్య వాపోయారు. త్వరలో జరగబోయే ఎమ్మెల్యే ఎన్నికల్లో పరిగి నియోజకవర్గం పోటీలో నేను ఉంటానని లాలయ్య అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజల సమస్యలపై నిరంతరం పోరాడే వ్యక్తినని పేద ప్రజల అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తానని వివరించారు. రానున్న ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా కార్యచరణ సిద్ధం చేసుకుని ముందడుగు వేస్తున్నట్లు ఆయన తెలిపారు. త్వరలో పల్లె పల్లెకు ప్రజల మధ్యకు అనే కార్యక్రమం చేపడుతున్నట్లు వివరించారు. ప్రజల సమస్యల పరిష్కారానికి, అభివృద్ధి పనులు సాధించడానికి అందరిని కలుపుకొని భవిష్యత్తులో ప్రజా ఎజెండాతో ఎన్నికలకు వెళ్తానని అన్ని వర్గాల మద్దతుతో విజయం సాధిస్తానని ఆశా భావం వ్యక్తం చేశారు. పరిగి నియోజకవర్గ ప్రజల మద్దతుతో ఆశీస్సులతో బరిలో ఉంటానని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎక్కడ కూడా ఉచిత విద్య వైద్యంను అమలు చేయడం లేదని ఈ సందర్భంగా ఆయన వివరించారు. వెనుకబడిన కులాలకు వెనుకబడిన జాతులకు ఉచిత విద్య ఉచిత వైద్యం అందించినప్పుడే వారి జీవనశైలి విధానం బాగుంటుందని ఆయన అన్నారు. ముందు తరాలు కూడా అభివృద్ధిలో బాగుంటాయని ఆయన వివరించారు. పరిగి నియోజకవర్గగాని నేను ఎన్నుకోవడానికి కారణం ఆధిపత్య కులాల పెత్తనం జరుగుతుందని ఈసారి జరగబోయే ఎన్నికలలో పరిగి నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని నిర్ణయించుకున్నారని అన్నారు. పరిగి నియోజకవర్గ ప్రజల ఆశీస్సులతో మొదటి నామినేషన్ నాదే వేయడం జరుగుతుందని కుమ్మరిపల్లి లాలయ్య అన్నారు.



