వికారాబాద్ జిల్లా, ప్రజాతంత్ర, జులై 19: రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో విజయం సాధించి అధికారం చేపట్టడం ఖాయమని రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షులు శివసేన రెడ్డి పేర్కొన్నారు. బుధవారం కాంగ్రెస్ పార్టీ యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో చేపట్టిన యువ పోరాట యాత్ర శివసేన రెడ్డి ఆధ్వర్యంలో చేపట్టడం జరిగింది ఈ యాత్ర నేడు వికారాబాద్ కు చేరుకోవడంతో వికారాబాద్ లో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శివసేనారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారంలోకి రాగానే నిరుద్యోగ యువతకు 3016 నిరుద్యోగ భృతి ఇస్తానని ఇప్పటికీ ఇవ్వలేదని ఆయన పేర్కొన్నారు. రైతులను ప్రజలను మోసానికి గురి చేస్తూ సీఎం కేసీఆర్ పాలన సాగిస్తున్నారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రామ్మోహన్ రెడ్డి మాజీమంత్రి ప్రసాద్ కుమార్ టిపిసిసి ప్రధాన కార్యదర్శి రఘువీరారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ మాయమాటలతో తెలంగాణ ప్రజానీకాన్ని మోసానికి గురి చేస్తూ పాలన సాగిస్తున్నారన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పరిపాలనపై రైతులు యువకులు మహిళలు బడుగు బలహీన వర్గాల ప్రజలంతా విసుగు చెంది ఉన్నారన్నారు. తెలంగాణలో రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి అధికారం చేపట్టడం ఖాయమని వారు ఉద్యమ వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు సతీష్ రెడ్డి నియోజకవర్గం అధ్యక్షులు సంతోష్ గౌడ్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.




