మార్గర్శి చిట్‌ఫండ్ కేసు ఎప్పటికి తెగేనో, రాజమండ్రి మాజీ ఎంపి ఉండవల్లి
రాజమండ్రి, నవంబర్ 7 : ఏపీ విభజన చాలెంజ్ చేస్తూ వేసిన ఫిటిషన్‌తో పాటు అమరావతి రాజధాని పిటీషన్‌లపై సుప్రీంకోర్టులో ఈనెల 14న విచారణ జరుగుతుందని మాజీ ఎంపి ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. సుప్రీంకోర్టు విచారణకు హాజరవుతానని ఉండవల్లి అన్నారు. ఏపీ రాజధాని అమరావతిగా ఆనాడు ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్ ఒప్పుకున్న విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఏపీ ప్రభుత్వం చేస్తున్న నిర్ణయాలకు కోర్టులో స్టేలు వస్తున్నాయని, ప్రభుత్వం మాత్రం తన నిర్ణయాలను న్యాయపరంగా నిరూపించలేకపోతోందన్నారు. కాగా ఏపీ రాజధానిగా అమరావతిని తాను ఒప్పుకుంటున్నానని జగన్ ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు తెలిపారని ఉండవల్లి గుర్తు చేశారు.పవన్ కళ్యాణ్‌ను తాను విమర్శించనని ఉండవల్లి అరుణ్ కుమార్ స్పష్టం చేశారు. ఇకపోతే ఈనాడు సంస్థల అధినేత రామోజీరావుపై రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రామోజీరావుపై ఎలాంటి కేసులు పెట్టినా స్టేలు తెచ్చుకోగల ఘనుడని హాట్ కామెంట్స్ చేశారు. తన వద్ద ఆధారాలన్నీ జగన్ ప్రభుత్వాన్ని అందిస్తానన్నారు. రామోజీరావు చట్టాలకు అతీతుడు కాదనే విషయాన్ని ప్రజలు తెలుసుకోవాలని కోరారు. ఇప్పుడు రామోజీరావుపై ఉండవల్లి చేసిన కామెంట్స్ వైరల్గా మారాయి. చట్టాలను ఎలా మలుపు తిప్పవచ్చో దానికి మార్గదర్శే కేసు ఉదాహరణ అని ఉండవల్లి చెప్పారు.
దీనిపై తానొక పుస్తకాన్ని రాస్తానని తెలిపారు. మార్గదర్శి కేసు తేలేవరకు రామోజీరావు తాను ప్రాణాలతో ఉంటామో లేదో కూడా తెలియదన్నారు. రామోజీరావుకు సంబంధించిన మార్గదర్శి చిట్ఫండ్స్కి డిపాజిట్లు సేకరించే హక్కు లేదని ఉండవల్లి అరుణ్ కుమార్ స్పష్టం చేశారు. మార్గదర్శికి రామోజీరావుకు సంబంధం లేదంటూనే.. బ్యాలెన్స్ షీట్లో ఛైర్మన్‌గా రామోజీరావు సంతకం చేశారని ఉండవల్లి గుర్తు చేశారు. ’రిజర్వ్ బ్యాంక్ చట్టం ప్రకారం డిపాజిట్లు సేకరించే హక్కు మార్గదర్శి చిట్ఫండ్స్‌కు లేదు. మార్గదర్శికి రామోజీరావుకు సంబంధం లేదంటూనే.. సుప్రీంకోర్టుకు ఇచ్చిన అఫిడ్విట్లో మార్గదర్శి నాదే అని రామోజీ సంతకం చేశారు. సెక్షన్ 10 ప్రకారం ఏ చిట్ఫండ్ కంపెనీ ఇతర ఏ వ్యాపారం చేయకూడదు. కానీ రామోజీరావు మాత్రం మార్గదర్శి చిట్ఫండ్ కింద సేకరించిన డబ్బులను మిగతా వ్యాపారాలకు వాడుకున్నారు. ఇలా డిపాజిట్లు సేకరించి.. వేరే వ్యాపారాలకు వాడుకోవడం చట్టవిరుద్ధం’ అని ఉండవల్లి అరుణ్ కుమార్ తేల్చిచెప్పారు. ’చిట్ఫండ్ కంపెనీ నడుపుతున్న రామోజీరావు ఇతర వ్యాపారాలు చేస్తున్నారు. చట్టం తన పని తాను చేసుకుపోతుందనేది పచ్చి అబద్ధం. చట్టం అనేది కొరడా లాంటిది. కోర్టులో ఒకసారి చిట్ఫండ్ తనదే అని రామోజీ అన్నారు.. మరోసారి కాదన్నారు. నేను చెప్పే ప్రతీ అంశానికి డాక్యుమెంటరీ ఆధారం ఉంది. మార్గదర్శి రామోజీదా? కాదా? అనేది తేల్చాలి.
రామోజీరావుకు చిట్ఫండ్ కంపెనీకి సంబంధం ఉందా లేదా?. మార్గదర్శితో రామోజీకి సంబంధం లేకుంటే కేసు విత్‌డ్రా చేసుకుంటాను. రామోజీపై ఎలాంటి కేసులు పెట్టినా వెంటనే స్టే తెచ్చుకోగలరు. రామోజీరావు లాంటి వ్యక్తితో పెట్టుకోవడానికి ఎవరూ సాహసించరు’ అంటూ ఉండవల్లి చేసిన వ్యాఖ్యలు వైరల్గా మారాయి. మార్గదర్శిపై తాను కేసు పెట్టి 16 ఏళ్లు అయ్యిందని ఉండవల్లి గుర్తు చేశారు. దానిపై చర్యలు చేపట్టకుండా మిగిలిన చిట్ఫండ్ కంపెనీలపై చర్యలు తీసుకోవడం వల్ల ప్రయోజనం ఏ ఉండదన్నారు. మార్గదర్శి కేసు 16 ఏళ్ళు పూర్తయిందని, మార్గదర్శిని తనిఖీ చేయకుండా ఏపీలో ఉన్న ఛిట్ పండ్ కంపెనీలన్నీ తనిఖీ చేస్తే ప్రయోజనం ఉండదని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. తన వద్ద ఉన్న ఆధారాలన్నీ జగన్ ప్రభుత్వానికి అందజేస్తామన్నారు. చట్టాలకు రామోజీరావు అతీతుడు కాదన్న విషయం జనం తెలుసుకోవాలన్నారు. చట్టాలను ఎలా మలుపు తిప్పచ్చో మార్గదర్శి కేసే ఉదాహణ అని ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. దీనిపై త్వరలో పుస్తకం రాస్తానన్నారు. మార్గదర్శి కేసు తేలేసరికి రామోజీరావు, తాను బ్రతికి ఉంటామో లేదో అని అన్నారు.




