రాఘవ మాకేదారి !

రాఘవ రాఘవ రాఘవ
మమ్మాదుకొనగ రావ
మనమున వజ్ర సంకల్పం
కరముల నీ సేవనం !

నీ అనుగ్రహం ఉంటే
ఆ మర్రి ఈ మర్రి ఏల
కష్ఠాల కడలిని లంఘించే
హనుమంతులం కాలేమా!

మీ ప్రభ వుంటే చాలదా
ఉడుత భక్తులం కామా
చదువుల కొలువుల
వెన్నెలై వెలగలేమా !

పాస్పోర్ట్ ‌వీసాల
మోసాలెరుంగకుంటిమి
పని బాటల చదువుల
సంపాదన
నింపాది అనుకొంటిమి

అవసరాల వారిది కట్టి
పల్లే పట్నం అమెరికా జేరా
ట్రంప్‌ ‌కంచే వేసే మోదీ
రాఘవ మాకేదారి!
   – పి.బక్కారెడ్డి
                          9705315250

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *