రాగల రెండు రోజుల్లో పలుచోట్ల వర్షాలు

హైదరాబాద్‌ ‌వాతావరణ కేంద్రం వెల్లడి

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 12 : ‌తెలంగాణలో రాగల రెండు రోజుల్లో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ ‌వాతావరణ కేంద్రం వెల్లడించింది. సోమవారం నుంచి మంగళవారం ఉదయం వరకు ఆదిలాబాద్‌, ‌కుమ్రంభీం ఆసిఫాబాద్‌, ‌మంచిర్యాల, నిర్మల్‌, ‌ములుగు, భదాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, గంటకు 30-40 కిలోవి•టర్ల వేగంతో గాలులు వీచే అవకాశాలున్నాయని పేర్కొంది. మిగతా ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు కురిసే సూచనలున్నాయని తెలిపింది.

లాగే కుమ్రంభీం ఆసిఫాబాద్‌, ‌మంచిర్యాల, కరీంనగర్‌, ‌పెద్దపల్లి, ములుగు, భదాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో వడగాల్పులు వీస్తాయని హెచ్చరించింది. మంగళవారం నుంచి బుధవారం ఉదయం వరకు వికారాబాద్‌, ‌సంగారెడ్డి, మెదక్‌, ‌కామారెడ్డి, మహబూబ్‌నగర్‌, ‌నాగర్‌ ‌కర్నూల్‌, ‌వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల ఉరుములు, మెరుపులు, గంటకు 30-40 కిలోవి•టర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. ఈ మేరకు వాతావరణ శాఖ ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *