రసం పీల్చే పురుగుల నుండి పత్తి పంటలను కాపాడుకోవాలి

ఆమనగల్లు, ప్రజాతంత్ర సెప్టెంబర్ 20 : రైతులు వేసుకున్న పత్తి పంటలలో రసం పీల్చే పురుగుల బారిన పడకుండా పత్తి పంటను కాపాడుకోవాలని ఆమనగల్లు మండల వ్యవసాయ అధికారిని అరుణకుమారి కోరారు. బుధవారం ఆమనగల్లు మండలంలోని ఆకుతోటపల్లి, గౌరారం, పోలేపల్లి, గ్రామాల్లో వానకాలం వేసిన పత్తి, వరి, మొక్కజొన్న, జొన్న మొదలగు పంటలు పరిశీలించారు. పత్తిలోమొక్కలు గిడస బారి పెరుగుదల లేకపోవడం వలన రసం పీల్చే పురుగుల నుండి పంటలను రక్షించుకోవడానికి సస్యరక్షణచర్యలు తీసుకోవాలని రైతులకు సూచించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారులు శివతేజ, సాయిరాం,  రైతులు కుక్కునూరు సత్యనారాయణ రెడ్డి, అనంతరెడ్డి, మల్లమ్మ, దేవి బుజ్జి, మాత్రు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *