రజక సంఘం ఆధ్వర్యంలో తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ జయంతి 

కుల్కచర్ల, ప్రజాతంత్ర సెప్టెంబర్ 26: తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, వీర వనిత, సబ్బండ వర్గాల ఆత్మగౌరవ ప్రతీక, బహుజన బిడ్డ,(చాకలి చిట్యాల ఐలమ్మ 128 వ జయంతిని మండల రజక సంఘం ఆధ్వర్యంలో నిర్వహించారు.ఈ సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో ఎంపీపీ,కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులు బోలుసాని భీంరెడ్డి, స్థానిక సర్పంచ్ స్వామ్య వెంకట్రాంరెడ్డి,బొమ్మిరెడ్డి పల్లి సర్పంచి ఆంజనేయులు,ఎంపిటిసి ఆనందం, రజక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మోత్కూర్ వెంకటేష్ మాట్లాడారు.. ప్రభుత్వం బీసీ బందు లో నిజమైన కుల వృత్తుల పై ఆధారపడి జీవిస్తున్న వారికి  అన్యాయం చేసిందన్నారు.భిఆర్ఎస్ ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న వారికే ఊరిలో ఒకరికి , ఇద్దరికీ ఇచ్చారు.బిసి బంధు కులవృత్తులందరికి ఇవ్వాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఎంపీడీవో కార్యాలయ సీనియర్అసిస్టెంట్వెంకటయ్య జగదీశ్వరి,బిజెపి జిల్లా నాయకులు కాటన్ పల్లి ఆంజనేయులు, రజక సంఘం మండల కార్యదర్శి  చాకలి రాములు, నాగని వెంకట్రాములు,నీలకంఠ, రజక సంఘం గ్రామ అధ్యక్షుడు చాకలి లక్ష్మయ్య , ఉపాధ్యక్షుడు కృష్ణయ్య,  ప్రధాన కార్యదర్శి చాకలి వెంకటయ్య, కార్యదర్శులు మోత్కూర్ భీమయ్య, బొమ్మిడిపల్లి యాదయ్య , ఇప్పాయిపల్లి గ్రామ అధ్యక్షులు చాకలి ఆంజనేయులు, బాలయ్య,గోపాల్, భీమయ్య, రాజు, తిరుపతి, కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *