రంగనాయకస్వామి ఫార్మసీ కళాశాలకు కౌన్సిల్‌ అనుమతి

సిద్ధిపేట, ప్రజాతంత్ర, ఆగస్ట్‌ 15: జిల్లా కేంద్రమైన సిద్ధిపేట పట్టణం సమీపంలోని రామంచ వద్ద స్థానిక శాసనసభ్యుడు, రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు చొరవతో ఎగ్జిబిషన్‌ సొసైటీ ఆధ్వర్యంలో నిర్మాణమవుతున్న శ్రీ రంగనాయకస్వామి ఫార్మసీ కళాశాలకు సంబంధిత ఫార్మసీ కౌన్సిల్‌ అనుమతించింది. ఈ విద్యా సంవత్సరం 2023-24 నుండి బి.ఫార్మసీ మొదటి సంవత్సరంతో కోర్సు ప్రారంభం కానున్నది. 60 సీట్లతో మొదటి సంవత్సరానికి అడ్మిషన్‌కు అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కాలేజీకి 9293 నంబరు కేటాయించారు. ఉస్మానియా విశ్వవిద్యాలయానికి అనుబంధం నిర్వహణ ఉంటుంది. కళాశాల నిర్మాణ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. పనులు తుది దశకు చేరుకున్నాయి.
సంతోషం వ్యక్తం చేసిన మంత్రి హరీష్‌రావు
రంగనాయకస్వామి ఫార్మసీకి కౌన్సిల్‌ అనుమతి ఇవ్వడం పట్ల రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు సంతోషం వ్యక్తం చేశారు. సిద్దిపేట ప్రాంతం విద్యా నిలయంగా మారుతున్న నేపథ్యంలో సిద్దిపేట మరో అడుగు ముందుకు పడిరదన్నారు. అదే విధంగా సిద్దిపేట ఫార్మసీపై ఆసక్తి గల విద్యార్థులకు ఇక్కడే చదువుకొనే గొప్ప అవకాశం రావడం సంతోషంగా ఉందనన్నారు. ఈ సందర్భంగా వొచ్చే కొద్ది రోజుల్లో స్వంత భవనంలోనే విద్యా సంవత్సరం ప్రారంభం కాబోతోందని మంత్రి హరీష్‌రావు చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *