యోగ క్రీడాకారులను  ప్రోత్సాహం  రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు

సిద్ధిపేట, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 26: బాల్యం నుంచే యోగ సాధన నిరంతరంగా చేస్తూ జాతీయస్థాయిలో మెడల్స్ ను సాధించాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు ఆశీర్వదించారు. సిద్దిపేట క్యాంప్ ఆఫీసులో మంగళవారం రాష్ట్రస్థాయి యోగా పోటీల్లో మూడో స్థానంలో నిలిచిన సిద్దిపేట జిల్లా యోగ క్రీడాకారులను ఆయన అభినందించారు. ఈ సందర్భంగ ఆయన మాట్లాడుతూ… జాతీయస్థాయిలో మెడల్స్   సాధించడానికి తమ వంతు సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. యోగ విద్యను జీవితంలో భాగం చేసుకోవాలని సూచించారు. నిరంతర సాధనతో అద్భుతాలు సృష్టించవచ్చని చెప్పారు. మానసిక , శారీరక దృఢత్వాన్ని సంతరించుకున్న  వారికి అద్భుతమైన భవిష్యత్తు ఉంటుందని చెప్పారు. భవిష్యత్తులో సిద్దిపేట జిల్లా ఖ్యాతిని యోగా రంగంలో మరింత వైభవంగా నిలపాలని ఆకాంక్షించారు.తెలంగాణ రాష్ట్ర యోగ సన స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 22వ తేదీ నుంచి 24 సెప్టెంబర్ మహేశ్వర మహా పిరమిడ్ సెంటర్,  కడ్తల్ , హైదరాబాద్ నందు రాష్ట్ర యోగ పోటీలు జరిగాయి. ఈ కార్యక్రమంలో సిద్దిపేట జిల్లా యోగాసనా స్పోర్ట్స్ అసోసియేషన్ ప్రతినిధులు కే .అంజయ్య  తోట అశోక్ , నిమ్మ శ్రీనివాస్ రెడ్డి , యోగ శిక్షకులు తోట సతీష్ ,  సంధ్య , చిప్ప ప్రభాకర్ , రాష్ట్రస్థాయి పోటీల్లో మెడల్స్ సాధించిన క్రీడాకారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *