- బిజెపి రాష్ట్ర కార్యాలయంలో యోగా వేడుకల్లో రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్
- బండి సంజయ్‌కు భద్రత పెంపు
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 21 : దేశవ్యాప్తంగా బీజేపీ ఆధ్వర్యంలో 75వేల ప్రదేశాల్లో యోగా దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్నామని రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ తెలిపారు. రాష్ట్రంలోనూ ప్రాముఖ్యత కలిగిన అనేక ప్రాంతాల్లో యోగా దినోత్సవాన్ని జరుపుకుంటున్నామన్నారు. ఎవరో ఒకరు ఏదైనా అంశానికి సంబంధించి దాని ప్రాముఖ్యతను తెలియజేస్తే తప్ప సమాజం పాటించే పరిస్థతి లేదని అన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, బీజేపీ జాతీయ సంస్థాగత సహ కార్యదర్శి శివప్రకాష్ ఈ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ…యోగా గొప్పతనాన్ని, భారతీయ సనాతన ధర్మాన్ని ప్రపంచానికి చాటి చెబుతున్న నాయకుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అని తెలిపారు. ప్రతి ఒక్కరూ నిత్యం యోగా చేయడంతో పాటు మరో పది మందితో యోగా చేసేలా కృషి చేయాలని బండి సంజయ్ పేర్కొన్నారు. శివప్రకాష్ మాట్లాడుతూ…యోగా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం రోజు మాత్రమే కాకుండా ప్రతి నిత్యం యోగా చేయడం అలవర్చుకోవాలని సూచించారు. ఈ వేడుకల్లో కార్యవర్గ సమావేశాల ఇంఛార్జ్ అర్‌వింద్ వి•నన్, తదితరులు పాల్గొన్నారు.
బండి సంజయ్‌కు భద్రత పెంపు
రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌కు పోలీసులు భద్రతను పెంచారు. బండి సంజయ్‌కు 1ప్లస్ 5తో రోప్ పార్టీ ఏర్పాటు చేశారు. అదనంగా ఎస్కార్ట్ వాహనాన్ని పోలీసులు కేటాయించారు. హైదరాబాద్ పరిధిలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడికి భద్రత పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. కరీంనగర్‌లో చేసిన వ్యాఖ్యలతో బండి సంజయ్‌కు ముప్పు ఉన్నట్లు ఇంటెలిజెన్స్ నివేదిక ప్రకారం పోలీసులు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. అలాగే ప్రస్తుతం అగ్నిపథ్‌లాంటి తాజా పరిస్థితుల నేపథ్యంలో భద్రత ఏర్పాటు చేశారు.




