యేసుక్రీస్తు జీవితం క్షమాగుణానికి, శాంతి స్థాపనకు  నిదర్శనం

 షాద్ నగర్ ఎమ్మేల్యే వీర్లపల్లి శంకర్
 క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్ రెడ్డి
షాద్ నగర్ ప్రజా తంత్ర డిసెంబర్ 25: స్థానిక  షాద్ నగర్ పట్టణంలో  క్రిస్టియన్ కాలనీ జియాన్ యంబి చర్చ్ క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రత్యేక ప్రార్థన కార్యక్రమంలో పాల్గొన్న షాద్ నగర్ నియోజకవర్గం ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్ రెడ్డి, అనంతరం ఎమ్మెల్యే శంకర్  మాట్లాడుతూ ఏసుప్రభు బోధనలు శాంతి ప్రేమ సౌబ్రాతృత్యం సహనం ఎప్పటికీ అనుసరణీయమని అన్నారు. షాద్ నగర్  నియోజకవర్గం క్రైస్తవ సోదర సోదరీమణులందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు.
సోదరులు ఆనందోత్సాహాలతో సంతోషంగా క్రిస్మస్ జరుపుకోవాలని సూచించారు మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ.. క్రీస్తు అనుసరించిన మార్గాన్ని అనుసరించి సమాజ అభివృద్ధి కోసం ప్రజలందరూ పాటుపడాలని మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్ రెడ్డి పిలుపునిచ్చారు.అనంతరం బైపాస్  శివారులో ఎఫ్ సి ఎన్ హోమ్ క్రిస్మస్ సంబరాలు   కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్ రెడ్డి కలసి లతో హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు  చెంది తిరుపతిరెడ్డి బాబర్ అలీ ఖాన్, బాలరాజ్ గౌడ్, అగ్గనూర్ బస్వo, అందే మోహన్, శ్రీకాంత్ రెడ్డి, ఖదీర్, పురుషోత్తం రెడ్డి, కృష్ణ, జంగా నర్సింహులు, కుమార స్వామి గౌడ్,  కార్యకర్తలు పాల్గొన్నారు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *