యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం

– బస్సు, ట్రక్కు ఢీ: ఆరుగురి దుర్మరణం

లక్నో, ఏప్రిల్ 13 : ఉత్తరప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. హాపూర్ ప్రాంతంలో బస్సు, ట్రక్కు ఢీకొన్న ఘటనలో ఆరుగురు దుర్మరణం చెందగా, ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. పెళ్లి వేడుక నుంచి తిరిగి వస్తున్న ప్రయాణికులతో వెళ్తున్న బస్సు ముందున్న ట్రక్కును ఢీకొట్టడంతో ఈ ప్రమాదం సంభవించినట్లు పోలీసులు తెలిపారు. సమాచారం అందిన వెంటనే అధికారులు సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. ఎస్పీ జ్ఞానంజయ్ సింగ్ వివరాల ప్రకారం ఆరుగురు అక్కడికక్కడే మరణించారు. గాయపడిన వారిని dసమీప హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదానికి గురైన ట్రక్కును రహదారి నుంచి తొలగించి ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు. మృతుల కుటుంబ సభ్యులు సంఘటన స్థలానికి చేరుకుని విషాదంలో మునిగిపోయారు. బస్సులో ప్రయాణిస్తున్న 12 మందిని గుర్తించగా ఒక వ్యక్తి ఆచూకీ ఇంకా తెలియరాలేదని అధికారులు తెలిపారు. బస్సు డ్రైవర్ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమై ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *