యూఎస్‌ ‌విద్యార్థి వీసాలు మరింత సరళం

న్యూయార్క్, ‌డిసెంబర్‌ 27 : అమెరికాలో ఉన్నత చదువులకు వెళ్లాలనుకుంటున్న వారికి వీసా నిబంధనలు సరళీకృతం కానున్నాయి. ఈ విషయంలో అమెరికా మరోమారు ఉదార నిర్ణయం తీసుకుంది. అగ్రరాజ్యం అమెరికా విద్యార్థి వీసా ఇంటర్వ్యూలకు  సంబంధించి తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. వీసా ఇంటర్వ్యూలో ఒకసారి ఫెయిల్‌ అయిన స్టూడెంట్స్‌కు మరోసారి హాజరయ్యే అవకాశం కల్పించాలని జో బైడెన్‌ ‌సర్కార్‌ ‌నిర్ణయించింది. ఫాల్‌ ‌సీజన్‌కు సంబంధించి దేశ రాజధాని ఢిల్లీలోని ఎంబసీ కార్యాలయం తో పాటు ముంబై, కోల్‌కతా, హైదరాబాద్‌, ‌చెన్నై కాన్సులేట్‌ ‌కార్యాలయాల్లో విద్యార్థి వీసా ఎఫ్‌-1 ‌దరఖాస్తుల ప్రాసెస్‌ ‌చివరి అంకానికి చేరింది.

ఈ వారాంతంలోగా ఈ పక్రియ కంప్లీట్‌ అయ్యే అవకాశం ఉందని సంబంధిత అధికారులు తెలిపారు. దాంతో ఈ విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంటర్వ్యూ పక్రియ ముగిసేలోపు ఒకదఫా విఫలమైన విద్యార్థులకు రెండోసారి హాజరయ్యే వీలు కల్పించాలని యూఎస్‌ ‌నిర్ణయించింది. ఇదిలాఉంటే.. గతేడాది నుంచి ఒక సీజన్‌లో ఒక దఫా మాత్రమే ఇంటర్వ్యూ స్లాట్‌ ‌పొందేలా సాప్ట్‌వేర్‌లో అమెరికా ప్రభుత్వం మార్పులు చేసిన విషయం తెలిసిందే. దీంతో ప్రత్యేకంగా స్లాట్స్ ‌విడుదల చేస్తే తప్ప రెండోదఫా ఇంటర్వ్యూకు హాజరయ్యే అవకాశం లేకుండా పోయింది. అయితే, ఈ విద్యా సంవత్సరంలో ఒక దఫా వీసా ఇంటర్వ్యూకు హాజరై విఫలమైన వారికి మరో అవకాశం కల్పిస్తామని యూఎస్‌ ఎం‌బసీ సీజన్‌ ‌మొదలు కావడానికి ముందే ప్రకటించింది.

అన్నట్టుగానే ఇప్పుడు దీనిపై కీలక ప్రకటన చేసింది. వచ్చే నెల వీసా స్లాట్లు రానున్నాయి. ఇది నిజంగా భారతీయ విద్యార్థులకు తీపి కబురు అనే చెప్పాలి. దీనిలో భాగంగా వచ్చే నెలలో వీసా ఇంటర్వ్యూ తేదీ స్లాట్లు విడుదల చేయాలని అగ్రరాజ్యం తాజాగా నిర్ణయం తీసుకుంది. మన దగ్గర ఉన్న ముంబై, కోల్‌కతా, హైదరాబాద్‌, ‌చెన్నై, ఢిల్లీ కార్యాల యాల్లో ఈ సదుపాయం ఉంటుంది. ఇప్పటికైతే కచ్చితమైన తారీఖులు ఖరారు కానప్పటికీ వచ్చే నెల తొలివారంలో వీసా స్లాట్లు రిలీజ్‌ అయ్యే అవకాశాలు ఉన్నాయని యూఎస్‌ ఎం‌బసీ కార్యాలయం పేర్కొంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *